Manipur: మణిపూర్ లో 50 ఏళ్ల మహిళను కాల్చి చంపిన దుండగులు.. రాష్ట్రంలో ఆగని హింస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: మణిపూర్ లో గత రెండున్నర నెలలుగా హింస కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. ఎటువంటి హెచ్చరికలు జారీ చేసినా ఇప్పటికే హింస ఆగడం లేదు. తాజాగా మణిపూర్‌లో ఒక ఇంట్లోకి చొరబడిన దుండగులు 50 ఏళ్ల మహిళను దారుణంగా కాల్చి చంపారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని ఈస్ట్ జిల్లా సావోంబంగ్ ప్రాంతంలో 50 ఏళ్ల వయసున్న మహిళ ముఖంపై దుండుగులు కాల్పులు జరిపారు. ఆమె ఇంట్లోకి చొరబడి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆమె ముఖాన్ని వికృతంగా మార్చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మణిపూర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సమీప ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనలో చనిపోయిన మహిళ కొంత మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని.. ఆ మహిళ మారింగ్ నాగా కమ్యూనిటీకి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఆ మహిళ ఎవరనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రజల వాంగ్మూలాలు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Governor Tamilisai: బోనాల కోసం నాకు ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ రాలేదు..
Also Read
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
మరో ఘటనలో పార్క్ చేసిన ట్రక్కులను కూడా దుండగులు తగులబెట్టారు. ఇంఫాల్ (డబ్ల్యూ) నుంచి నేషనల్ హైవే -2 మీదుగా వెళ్తున్న సిలిండర్లను తీసుకెళ్లడానికి ఉపయోగించే ట్రక్కులను బహిరంగ ప్రదేశంలో నిలిపి ఉంచారు. ఈ సమయంలో వాటికి నిప్పంటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఇంకా గుర్తించలేదని, ట్రక్కులకు ఎందుకు నిప్పుపెట్టారో స్పష్టంగా తెలియదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మణిపూర్ లో పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చినవి మినహా అన్ని ప్లాట్ ఫామ్ లు, అన్ని సర్వీస్ ప్రొవైడర్లలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. అధికారులు ఆమోదించిన కేస్-టు-కేస్ ప్రాతిపదికన ఇంటర్నెట్ లీజ్ లైన్ (ఐఎల్ఎల్) వినియోగదారులను కూడా నిషేధం నుండి మినహాయించారు.
Read also: Anganwadi Jobs : అంగన్వాడీ లో భారీగా ఉద్యోగాలు.. పది పాసైన వాళ్ళు అర్హులు..
మే 3న మీటీలను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ కు నిరసనగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్ యూ) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో హింస చెలరేగింది. మెయిటీ, కుకి వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజనులు – నాగాలు, కుకిలు – జనాభాలో మరో 40 శాతం మంది ఉన్నారు. వారు కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు. ఈ రెండు జాతుల మధ్య వైరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!