జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఓ ఐటీబీపీ జవాన్ తన ముగ్గురు సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. అనంతరం అతడు కూడా కాల్చుకుని అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
ప్రపంచవ్యాప్తంగా కండోమ్ వినియోగం పెరుగుతున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ప్రజల్లో లైంగిక వ్యాధుల పట్ల పెరుగుతున్న అవగాహన, ఇ- కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి కారణంగా కండోమ్ వాడకం పెరిగినట్లు ఆ నివేదికలో పేర్కొంది.
44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జూలై 28న చెన్నైలోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని నేపియర్ బ్రిడ్జ్‌కి చెస్ బోర్డులా పేయింట్ వేశారు. ఈ బ్రిడ్జ్ ప్రయాణికులను అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. వందేళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. చెస్ బోర్డులా పెయింట్ వేయబడిన ఈ వంతెన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇంధనం, గ్యాస్, అవసరమైన ఆహార పదార్థాలను అందించడానికి అత్యవసర సహాయ కార్యక్రమాన్ని అమలు చేయాలని రణిల్ విక్రమసింఘే నిర్ణయించారు. జులై 16న మంత్రులు, పార్లమెంటు సభ్యులతో జరిపిన చర్చల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ధూళి తుపాను కారణంగా హార్డిన్ సమీపంలోని మోంటానాలోని ఇంటర్‌స్టేట్ 90 ప్రాంతంలో 21 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి.
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేపట్టిన బీజేపీ ఎట్టకేలక ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసింది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జేపీ నడ్డా ప్రకటించారు.
జులై 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీ నేతలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ నేతలకు వివరించారు.
మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రవాహం కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. మహారాష్ట్ర విపత్తు పరిస్థితుల నివేదిక ప్రకారం జూన్ 1 నుండి మహారాష్ట్రలో సంభవించిన వర్షం, వరదలకు సంబంధించిన సంఘటనలలో మొత్తం 102 మంది ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం కొవిడ్-19 లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి శనివారం తెలిపింది.
ఒక్క నిమిషంలో 16విన్యాసాలు చేసి ఓ పంది గిన్నీస్ రికార్డులకెక్కింది. యజమాని చెప్పిన ఆదేశాలను పాటిస్తూ గినియా పంది విన్యాసాలు చేస్తున్న వీడియోను 'గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్' తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది.