Guinea Pig Record: ఒక్క నిమిషంలో 16విన్యాసాలు చేసి ఓ పంది గిన్నీస్ రికార్డులకెక్కింది. యజమాని చెప్పిన ఆదేశాలను పాటిస్తూ గినియా పంది విన్యాసాలు చేస్తున్న వీడియోను ‘గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్’ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. ‘గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్’ తరచుగా దాని సోషల్ మీడియా పేజీల్లో ప్రపంచవ్యాప్తంగా జంతువులు సృష్టించిన అద్భుతమైన రికార్డుల గురించి పోస్టులు చేస్తూ ఉంటుంది. నార్త్ కరోలినాకు చెందిన ఒక గినియా పంది సాధించిన ఈ అద్భుతమైన ప్రపంచ రికార్డును ఆ సంస్థ తన ఫేస్‌బుక్ పేజీలో వివరించింది. ఒక నిమిషంలో గినియా పంది చేసిన అత్యధిక విన్యాసాలు చేసి ప్రపంచ రికార్డ్ టైటిల్‌ను సంపాదించడానికి ఎలా ట్రిక్స్ నేర్చుకుందో వివరించింది.
వరల్డ్ రికార్డ్ ప్రయత్నానికి సంబంధించిన వీడియోను ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. ఒక నిమిషంలో గినియా పంది 16 విన్యాసాలు చేసిందంటూ వీడియో ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ రాశారు. ఆ పంది పేరు కోకో కాగా.. దానికి ఆదేశాలు జారీ చేసిన యజమాని పేరు గ్వెన్ ఫోర్డ్ అని ఆ పోస్ట్‌లో వెల్లడించారు. కోకో అనే గినియా పంది తన యజమాని అయిన గ్వెన్ ఆదేశాలపై విన్యాసాలు చేస్తున్నట్లు వీడియో చూపిస్తుంది.
రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోను 40 వేల మంది చూశారు. దాదాపు వెయ్యి మంది ఈ వీడియో గురించి కామెంట్లు చేశారు. ‘క్యూట్ అండ్ స్మార్ట్’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. ‘సో క్యూట్’ అంటూ మరొకరు పోస్ట్ చేశారు. “గినియా పందులు చాలా శిక్షణ పొందగలవని.. కానీ ఎప్పుడూ గ్రహించలేదు, వావ్,” అని మూడవ వ్యక్తి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. “కంగ్రాట్స్ కోకో!” అని మరొకరు వ్యాఖ్యానించారు.
Water Flow: హ్యాండ్ పంపుల నుంచి జలధార
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ఒక బ్లాగ్ ప్రకారం కోకో ఒక 4-5 సంవత్సరాల వయస్సు గల అబిస్సినియన్ గినియా పంది. గ్వెన్ 2018 డిసెంబరులో దానిని ఓ జంతు సంరక్షణా కేంద్రం నుంచి తీసుకొచ్చి పోషిస్తున్నాడు. కోకో శక్తిని, ఉత్సాహాన్ని గ్రహించిన గ్వెన్ ట్రిక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. కోకో త్వరలోనే 70కి పైగా ట్రిక్స్ నేర్చుకుని సర్టిఫైడ్ ట్రిక్ గినియా పిగ్ ఛాంపియన్ అయింది.