global Condom Market: అవి తెగవాడేస్తున్నారు.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
global Condom Market: ప్రపంచవ్యాప్తంగా కండోమ్ వినియోగం పెరుగుతున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ప్రజల్లో లైంగిక వ్యాధుల పట్ల పెరుగుతున్న అవగాహన, ఇ- కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి కారణంగా కండోమ్ వాడకం పెరిగినట్లు ఆ నివేదికలో పేర్కొంది. 2025 నాటికల్లా అంతర్జాతీయంగా కండోమ్ మార్కెట్ విలువ 370కోట్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. చైనా, భారత్, జపాన్ దేశాలు కీలక మార్కెట్లుగా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల సృష్టికర్తలెవరో తెలుసా..?
Also Read
పెరుగుతున్న డిమాండ్ కారణంగా అంతర్జాతీయంగా కండోమ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నట్లు పేర్కొంది. వార్షిక వృద్ధిరేటు 8 శాతంగా ఉంటుందని తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచే 44శాతం వృద్ధి ఉంటుందని పేర్కొంది. ప్రజల్లో లైంగిక అంటువ్యాధుల పట్ల అవగాహన పెరగడమే కండోమ్ వాడకం పెరుగుదలకు కారణమని టెక్‌నావియో నివేదిక పేర్కొంది. లైంగిక అంటువ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, వివిధ రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండటం మార్కెట్ విస్తరణకు కారణమని పేర్కొంది. ఇ-కామర్స్ వేదికలు అభివృద్ధి చెందుతుండటం కూడా కండోమ్ మార్కెట్ పెరుగుదలకు కారణమని అభిప్రాయపడింది. మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వేగవంతమైన సరఫరా, మాస్ కస్టమైజేషన్, పర్సనలైజేషన్ వంటి వ్యూహాలపై కండోమ్ తయారీ సంస్థలు దృష్టి సారించాలని సూచించింది. వినియోగదారులు గోప్యతతో షాపింగ్ చేయడం కోసం కండోమ్ ప్రొవైడర్లు ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కండోమ్‌ల అనుకూలీకరణ, అలాగే వాటి ప్యాకేజింగ్‌పై పెరుగుతున్న దృష్టి కారణంగా మార్కెట్ పెరుగుతోందని ఆ నివేదికలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
-
AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
-
OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
-
SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
-
Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!