Maharashtra Floods: మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రవాహం కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. మహారాష్ట్ర విపత్తు పరిస్థితుల నివేదిక ప్రకారం జూన్ 1 నుండి మహారాష్ట్రలో సంభవించిన వర్షం, వరదలకు సంబంధించిన సంఘటనలలో మొత్తం 102 మంది ప్రాణాలు కోల్పోయారు.గత 24 గంటల్లో రెండు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కుండపోత వర్షాల మధ్య మొత్తం 68 మంది గాయపడ్డారు. ఇప్పటివరకు జంతువుల మరణాల సంఖ్య 189కి చేరుకుంది.రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మొత్తం 13 ఎన్డీఆర్‌ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 11,836 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 73 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు.
GST on Food Items: సామాన్యుడిపై మరో భారం.. పెరగనున్న నిత్యావసరాల ధరలు
మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లాలోని ప్రధాన నదులు వైతర్ణ, తాంసా ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. జూలై 17న మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుణె, సతారా, షోలాపూర్, నాసిక్, జల్గావ్, అహ్మద్‌నగర్, బీడ్, లాతూర్, వాషిం, యవత్మాల్, ధూలే, జల్నా, అకోలా, భండారా, బుల్దానా, నాగ్‌పూర్, నందుర్‌బార్‌తో సహా రాష్ట్రంలోని భారీ వర్షాల కారణంగా 28 జిల్లాలు ప్రభావితమయ్యాయి. ముంబై సబ్, పాల్ఘర్, థానే, నాందేడ్, అమరావతి, వార్ధా, రత్నగిరి, సింధుదుర్గ్, గడ్చిరోలి, సాంగ్లీ, చంద్రపూర్‌లలో వర్షాల వల్ల వరదల సంభవించాయి. భారీ వర్షాల కారణంగా కొల్హాపూర్, పాల్ఘర్, నాసిక్, పూణే, రత్నగిరి జిల్లాల్లో జూలై 14 వరకు రెడ్ అలర్ట్, ముంబైలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.