Parliament Monsoon Session: మంగళవారం రాజ్యసభలో జరిగిన గందరగోళ పరిస్థితుల మధ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక ధరలపై సభలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. డిప్యూటీ ఛైర్మన్ సభను సజావుగా సాగేలా సహకరించాలంటూ కోరారు. కానీ ఆందోళనను విరమించకపోవడంతో… నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ, సభా కార్యకలాపాలరు అంతరాయం కలిగిస్తున్నారంటూ విపక్షాలకు చెందిన 18 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ వారం చివరవరకు ఎంపీలపై సస్పెన్షన్ కొనసాగుతుందంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఈ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. డిప్యూటీ ఛైర్మన్ ఈ తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులు తక్షణమే సభను వీడాలని సూచించారు. సభను తొలుత 20 నిమిషాలు వాయిదా వేశారు.
సస్పెండ్ అయిన ఆ 19 మంది సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన బడుగుల లింగయ్య, రవిచంద్ర వద్దిరాజు, దామోదర్‌రావులతో పాటు సుస్మితా దేవ్, శాంతను సేన్, డోలా సేన్, కనిమొళి, మౌసుమ్ నూర్, శాంతా ఛెత్రీ, నదీముల్, రహీమ్, గిరిరాజన్, అభిరంజన్ బిస్వార్, అహ్మద్ అబ్దుల్లా, రహీం, కల్యాణసుందరం, ఎన్.ఆర్.ఇలాంగో, శివదాసన్, సందోష్ కుమార్ ఉన్నారు. అయితే, సస్పెండ్ అయిన సభ్యులు.. సభను వీడకుండా అక్కడే నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందున.. సభను మరో గంటపాటు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ ప్రకటించారు.
Rahul Gandhi: పోలీసులు అదుపులో రాహుల్ గాంధీ.. కీలక నేతల అరెస్ట్
లోక్‌సభలో సోమవారం నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. అనుచిత ప్రవర్తనతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను మొత్తం వర్షాకాల సమావేశాల నుండి సస్పెండ్ చేశారు. మాణిక్కం ఠాగూర్ సహా నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో మాణిక్కం ఠాగూర్, టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్‌లు ఉన్నారు.