Rishi Sunak: బ్రిటన్‌తో పాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishi Sunak: ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ… తాను బ్రిటన్ ప్రధాని అయితే చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. బ్రిటన్‌తో పాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరణమించిందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా అమెరికా, భారత్ వంటి దేశాలను చైనా లక్ష్యంగా చేసుకుందని చెప్పడానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. యూకేకు చైనాను ముప్పుగా అభివర్ణిస్తూనే.. తాను ప్రధాని అయితే బ్రిటన్‌లోని చైనా కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్‌లు అన్నింటినీ మూసివేస్తానని.. చైనీస్ సైబర్-బెదిరింపులను ఎదుర్కోవడానికి కొత్త స్వేచ్ఛా దేశాల కూటమిని నిర్మిస్తానని సునాక్ వాగ్దానం చేశాడు. చైనా సాంకేతిక దూకుడుకు ఎదుర్కొనేందుకు నాటో మాదిరి సరికొత్త మిలటరీ వ్యవస్థను రూపొందించడంతోపాటు డ్రాగన్ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రణాళికలు తనదగ్గర ఉన్నాయన్నారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ రేసులో ఉన్న రిషి సునాక్.. తాజాగా జరిగిన ఓ టీవీ డిబేట్‌లో ఈ హామీలు ఇచ్చారు.
బ్రిటన్‌లోని మొత్తం 30 చైనా కన్‌ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్‌లను మూసివేస్తానని.. ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య అన్నారు.కీలకమైన బ్రిటీష్ ఆస్తులను పరిరక్షిస్తానని, వ్యూహాత్మకంగా సున్నితమైన సాంకేతిక సంస్థలతో సహా కీలకమైన బ్రిటిష్ ఆస్తులను చైనా కొనుగోలు చేయడాన్ని నిరోధించాల్సిన అవసరాన్ని పరిశీలిస్తానని కూడా అతను హామీ ఇచ్చాడు. బ్రిటన్ సాంకేతికతను చైనా తస్కరిస్తోందని ఆరోపించిన రిషి సునాక్.. ఉక్రెయిన్‌పై దాడిలో రష్యాను సమర్థించడం మొదలు తైవాన్‌పై బెదిరింపులు, షిన్‌జియాన్, హాంకాంగ్‌లలో మానవహక్కుల అణచివేత వంటి దారుణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇక సాంస్కృతిక ప్రచార కేంద్రాల పేరుతో బ్రిటన్‌లో చైనా నెలకొల్పిన కన్‌ఫ్యుసియస్ ఇన్‌స్టిట్యూట్‌ల కొనసాగింపుతోపాటు బ్రిటన్-చైనా భాగస్వామ్యంతో చేపట్టిన పరిశోధన కార్యక్రమాలపై సమీక్ష జరుపుతామన్నారు. చైనా నుంచి పొంచివున్న ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలతో కలిసి పనిచేస్తానని రిషి సునాక్ చెప్పుకొచ్చారు.
Also Read
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
Monkeypox: జపాన్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు
కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది ఎంపీలు రిషికి మద్దతుగా నిలిచినప్పటికీ… పార్టీ సభ్యుల్లో మాత్రం ట్రస్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. కొద్దిరోజుల్లో మొదలుకానున్న సమ్మర్ క్యాంపెయిన్‌లో… రిషి, ట్రస్ టోరీ సభ్యులను కలిసి తమకు మద్దతు తెలపాలని కోరనున్నారు. ఆ తర్వాత ట్రస్‌కు ఇంకా ఎక్కువ మద్దతు లభిస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బ్రిటన్‌లోని బెట్టింగ్ రాయుళ్లు కూడా ట్రసే తమ ఫేవరెట్ అంటున్నారు. బ్రిటన్ ప్రధానిని ఎన్నుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల బ్యాలెట్ ఓటింగ్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. లక్షా 60 వేల మందికి పైగా ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని అంచనా. మహిళలు, పురుషులతో పాటు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసే వారిలో మెజార్టీ ఓటర్లు లిజ్ ట్రస్‌కే జై కొడుతున్నట్లు స్కై న్యూస్ సర్వే కూడా తెలిపింది. ప్రధాని రేసులో జరిగిన ఐదో రౌండ్లో రిషికి 137 ఓట్లు రాగా… ట్రస్‌కు 113 మాత్రమే వచ్చాయి. కానీ, సభ్యుల మద్దతు విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయేలా ఉందంటున్నాయి.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!