Farooq Abdullah: జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మాజీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై చార్జిషీట్ దాఖలు చేయబడింది. ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. 84 ఏళ్ల అబ్దుల్లాను పలుమార్లు ప్రశ్నించింది. చివరిసారిగా మే 31న శ్రీనగర్‌లో ఆయనను మూడు గంటలకు పైగా విచారించారు. 2019లో ఇదే కేసులో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఈడీ 2020లోనే ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించిన 11.86 కోట్ల ఆస్తులను స్తంభింపజేసింది. ఈ కేసులో ఇప్పటికే అబ్దుల్లాను ఈడీ పలు మార్లు విచారించింది. జేకేసీఏ అధ్యక్షుడిగా అబ్దుల్లా తన పదవిని దుర్వినియోగం చేశారని, బీసీసీఐ ఇచ్చిన నిధులను మళ్లించారని ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో జమ్ము కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన నిధులను స్వాహా చేసినట్లు అభియోగాలున్నాయి. అసోసియేషన్ ఆఫీస్ బేరర్‌లతో పాటు వివిధ వ్యక్తుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడినట్లు తెలిసింది. అసోసియేషన్ ఆఫీస్ బేరర్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు దర్యాప్తును ప్రారంభించింది. ఫరూక్ అబ్దుల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా తన పదవిని దుర్వినియోగం చేశారని.. బీసీసీఐ ప్రాయోజిత నిధులను లాండరింగ్ చేసేలా క్రీడా సంఘంలో నియామకాలు చేశారని ఈడీ ఆరోపించింది.
Lakhimpur Kheri Violence Case: ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ కోర్టు నిరాకరణ
సెప్టెంబర్ 2019లోృ అప్పటి జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి అహ్సన్ అహ్మద్ మీర్జాను ఈడీ అరెస్టు చేసింది. అతడిపై విచారణ జరుగుతోంది. ఈ విషయంపై తదుపరి విచారణ పురోగతిలో ఉందని ఈడీ తెలిపింది. దేశంలోని ప్రతిపక్ష నాయకులందరికీ కేంద్ర దర్యాప్తు సంస్థల సమన్లు సాధారణమని కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు కేంద్ర సంస్థలు ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తాయని అబ్దుల్లా అన్నారు.