Defence Ministry: స్వార్మ్ డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కార్బైన్లతో సహా సాయుధ దళాల కోసం 28,732 కోట్ల రూపాయల విలువైన సేకరణ ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన భారత సైనికులకు శత్రువుల ముప్పు నుంచి రక్షణ కల్పించాలనే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, తీవ్రవాద నిరోధక పరిస్థితులలో పోరాటాల గురించి ఆలోచించి భారత ప్రామాణిక బీఐఎస్-4 స్థాయి రక్షణతో కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌లను అందించాలని నిర్ణయించుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వాస్తవాధీన రేఖ, తూర్పు సరిహద్దుల వద్ద యుద్ధ సమయాల్లోనూ, టెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి సుమారు 4 లక్షల క్లోజ్ క్వార్టర్ బాటిల్ కార్బైన్‌లను కూడా అందించనున్నట్లు తెలిపింది. భారతదేశంలో చిన్న ఆయుధాల తయారీ పరిశ్రమకు ఊపును అందించడానికి, “ఆత్మనిర్భర్ భారత్”ను మెరుగుపరచడానికి సిద్ధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ శాఖ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి సంఘర్షణలలో, సైనిక కార్యకలాపాలలో డ్రోన్ సాంకేతికత ఎంతో అవసరమని నిరూపించబడింది. భారత సైన్యం సామర్థ్యాన్ని పెంపొందించడానికి డ్రోన్ సాంకేతికతను మరింత పెంపొందించేందుకు రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది.
Ragging: దిండును పట్టుకుని ఆ పని చేయండి.. మధ్యప్రదేశ్‌లోని వైద్యకళాశాలలో ర్యాగింగ్ భూతం
భారత పరిశ్రమ ద్వారా కోల్‌కతా తరగతి నౌకల్లో విద్యుత్ ఉత్పత్తి అప్లికేషన్ కోసం అప్‌గ్రేడ్ చేసిన 125కిలోవాట్స్ కెపాసిటీ మెరైన్ గ్యాస్ టర్బైన్ జనరేటర్‌ను కొనుగోలు చేయాలనే నేవీ ప్రతిపాదనను కూడా రక్షణ శాఖ ఆమోదించింది. గ్యాస్ టర్బైన్ జనరేటర్ల స్వదేశీ తయారీకి ఇది పెద్ద ఊపునిస్తుంది. మన దేశంలోని తీర ప్రాంతంలో భద్రతను పెంపొందించేందుకు 60 శాతం ఐసీతో కొనుగోలు (ఇండియన్-ఐడీడీఎం) కింద ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం 14 ఫాస్ట్ పెట్రోల్ వెసెల్స్ (ఎఫ్‌పీవి) సేకరణ ప్రతిపాదనను రక్షణ శాఖ ఆమోదించింది.