Parliament Monsoon Session: కొత్త రాష్ట్రాల ప్రతిపాదన లేదు.. పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament Monsoon Session: భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం స్పందించింది. ప్రస్తుతానికి దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే విషయంపై ఎలాంటి ప్రతిపాదన లేదని కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు, అభ్యర్థనలు అందుతుంటాయని.. కానీ ఏ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిగణనలో లేదని మంత్రి తెలిపారు. అలాగే మరో ప్రశ్నకు సమాధానంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 2014లో 70గా ఉందని, 2021 నాటికి 46కు పడిపోయిందని నిత్యానంద రాయ్ చెప్పారు.
Defence Ministry: సాయుధ బలగాల కోసం రూ.28,732 కోట్ల ప్రతిపాదనలకు రక్షణ శాఖ ఆమోదం
Also Read
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
మరోవైపు సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ ఇవాళ రాజ్యసభలో 19 మంది ఎంపీలపై వేటు పడింది. అయితే ఈ సస్పెన్షన్ తనకు ఏ మాత్రం ఇష్టం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ప్రభుత్వం చర్చ నుంచి తప్పించుకుంటుందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నా, వాస్తవంలో ప్రతిపక్షాలే ఈ పని చేస్తున్నాయన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరోనా నుంచి కోలుకున్న తర్వాత ధరల పెరుగుదల అంశంపై చర్చిస్తామన్నారు. ఎన్నో దేశాలతో పోల్చుకుంటే భారత్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో మెరుగ్గా వ్యవహరించిందన్నారు. కాగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..