Tollywood Love Marriages: లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Love Marriages: ప్రస్తుతం సినిమా తారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి సినిమా తారలలో ప్రేమ వివాహాలు చేసుకున్న వారు ఎవరెవరు ఉన్నారో చూద్దామా.. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రీల్ లైఫ్‌లో జోడీ కట్టి రియల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా మారిన హీరోహీరోయిన్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Ind vs Pak: బుమ్రా, వరుణ్ కంటే.. హార్దిక్ పాండ్యానే పాకిస్థాన్‌కు డేంజర్..!
Also Read
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
- itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
మహేశ్ బాబు – నమ్రత: ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడు మహేశ్ బాబు. ఆయన ‘వంశీ’ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ నమ్రతతో ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల ప్రేమా తర్వాత వీరిద్దరూ 2005లో వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నాగార్జున- అమల
తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర తారలుగా వెలుగొందుతున్న సమయంలోనే అక్కినేని నాగార్జున, అమల మధ్య ప్రేమ చిగురించింది. ఈ జంట 1992, జూన్ 11వ తేదీన వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఈ జంట కలిసి నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు ప్రేమయుద్ధం, కిరాయి దాదా, శివ (ట్రెండ్ సెట్టర్ మూవీ), నిర్ణయం ప్రేక్షకుల మదిలో ఎప్పటికి గుర్తుకు ఉండిపోతాయి.
శ్రీకాంత్ – ఊహ
తెలుగు తెరపై హీరో శ్రీకాంత్ – హీరోయిన్ ఊహలకు కాంబినేషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నిజానికి ఈ ఇద్దరి మధ్య ‘ఆమె’ సినిమా షూటింగ్ టైం నుంచి పరిచయం ఏర్పడింది. ‘ఆమె’ సినిమా తర్వాత వీరిద్దరు దాదాపు నాలుగు చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. అలా ఈ రీల్ లైఫ్ జోడీ మధ్య పరిచయం ప్రేమగా మారడంతో, ఇరువురు వారి కుటుంబాల్లో ఒప్పించి 1997లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ దంపతులకు రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోషన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే ఆయన నటించిన ఛాంపియన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి సక్సెస్‌ను అందుకుంది.
జీవిత-రాజశేఖర్
జీవిత-రాజశేఖర్‌లు ఫస్ట్ టైం ‘తలంబ్రాలు’ అనే సినిమాలో వెండి తెరపై కలిసి కనిపించారు. ఆ టైంలోనే ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ ‘ఆహుతి’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్‌లో రాజశేఖర్ ప్రమాదవశాత్తు గాయపడగా ఆయనను జీవిత జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ టైంలో జీవితకి రాజశేఖర్‌పై ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వీరిద్దరి లవ్ మ్యారేజ్‌కు ఒప్పుకున్నారు. చెన్నైలో 1991 జూలై 10 వివాహం జీవిత-రాజశేఖర్‌లు వివాహం చేసుకున్నారు. ఈ జంటకి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టాలీవుడ్‌లో హీరోయిన్లుగా రాణిస్తున్నారు.
అజిత్ – షాలిని: ‘బేబీ షాలిని’గా చిన్నప్పుడే గుర్తింపు పొందిన షాలిని, ఆ తర్వాత హీరోయిన్‌గానూ అలరించారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ను ఆమె 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
సూర్య – జ్యోతిక: సౌత్ ఇండియాలో అత్యంత పాపులర్ జంటగా పేరున్న సూర్య, జ్యోతికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006లో వివాహం చేసుకున్న ఈ జంటకు దియా అనే పాప, దేవ్ అనే బాబు ఉన్నారు.
నయనతార – విఘ్నేశ్ శివన్: లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ 2022, జూన్ 7న మహాబలిపురంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
ఆది పినిశెట్టి – నిక్కీ గల్రానీ: ‘మలుపు’ సినిమా సమయంలో చిన్న చిన్న గొడవలతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2022 మే 18న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
వీరితో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. దక్షిణాదిలో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా అనేక మంది స్టార్ హీరోహీరోయిన్స్ ప్రేమ వివాహాలు చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు. దక్షిణాదిన అక్కినేని నాగచైతన్య-శోభితా, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి, కిరణ్ అబ్బవరం – రహస్య, శివ బాలాజీ – మధుమిత, వరుణ్ సందేశ్ – వితిక, రాధిక – శరత్ కుమార్, ఆర్య – సాయేషా సైగల్, బాలీవుడ్‌లో బిగ్ బీ అమితాబ్ – జయా బచ్చన్, అభిషేక్ – ఐశ్వర్య రాయ్, కరీనా – సైఫ్ అలీ ఖాన్, దీపికా – రణ్‌వీర్ సింగ్ వంటి వారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
READ ALSO: Jagapathi Babu: టాలీవుడ్ స్టైలిష్ విలన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే!
తాజావార్తలు
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
-
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!