Blast at Cricket Stadium: ష్పగీజా క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా అప్ఘనిస్థాన్‌లోని కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా పలువురు గాయపడ్డారు. కాబూల్‌లోని అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో పేలుడు జరిగినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాసిబ్ ఖాన్ జద్రాన్ ధ్రువీకరించారని, ఈ సంఘటనలో నలుగురు గాయపడ్డారని ఆ దేశ స్థానిక మీడియా అవుట్‌లెట్ టోలో న్యూస్ తెలిపింది. ఆటగాళ్లకు, విదేశీ పౌరులకు ఎలాంటి హాని జరగలేదని జద్రాన్ తెలిపారు.
Sai Priya Missing Case: పోలీస్ స్టేషన్‌లో సాయిప్రియ కొత్త డ్రామా
పేలుడు సంభవించిన అనంతరం ప్రజలు భయాందోళనలతో బంకర్‌లోనికి పరిగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ష్పగీజా క్రికెట్ లీగ్ అనేది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతి సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్వహించే ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్. కాగా, బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ వర్సెస్ పామిర్ జల్మీ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన సంభవించింది. కాబూల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ష్పగీజా టోర్నమెంట్ సందర్భంగా పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు ధృవీకరించారు. భద్రతా అధికారులు ఇంకా స్పందించలేదు.
https://twitter.com/ImAbdullahs56/status/1553019802192691204?cxt=HHwWiIC-7YTSt40rAAAA