Adhir Ranjan Chowdhury: ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై రాష్ట్రపతికి అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివాదాస్పద “రాష్ట్రపత్ని” వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. “నోరు జారి అలా మాట్లాడానని హామీ ఇస్తున్నాను. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతున్నాను. మా క్షమాపణలను అంగీకరించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.” అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అధిర్ రంజన్ చౌదరి లేఖ రాశారు.
రాష్ట్రపతిని అవమానించాలని అలా అనలేదని.. పొరపాటుగా నోరు జారినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రపతికి బాధా అనిపిస్తే తానే స్వయంగా ఆమెను కలుసుకుని క్షమాపణలు చెబుతానన్నారు. కావాలంటే తనను ఉరితీయొచ్చని.. తాను శిక్షకు సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎందుకు ఇందులోకి లాగుతున్నారని ప్రశ్నించారు. తాను పొరపాటున “రాష్ట్రపత్ని” అనే పదాన్ని ఉపయోగించానని, అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా దీనిని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తోందని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
National Medical Commission: ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు శుభవార్త
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై లోక్‌సభ ఎంపీ అధీర్ చౌదరి చేసిన ‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యులు పార్లమెంట్‌లో నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పదవిని అవమానపరిచిందని.. ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ లోక్‌సభలో డిమాండ్ చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియా గాంధీ ఆమోదించాలంటూ ఆమె మండిపడ్డారు.
Congress MP Adhir Ranjan Chowdhury tenders apology to President Droupadi Murmu over "Rashtrapatni" remark.
"…I assure you that it was a slip of the tongue. I apologise and request you to accept the same," reads his letter. pic.twitter.com/dM1shdVU2C
— ANI (@ANI) July 29, 2022
తాజావార్తలు
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?