Rajasthan: దళిత బాలుడి హత్య.. రాజస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: తాగునీటి కుండను తాకినందుకు టీచర్ తీవ్రంగా కొట్టడం వల్ల ఓ దళిత బాలుడు మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. రాజస్థాన్‌లోని బరన్ మునిసిపల్ కౌన్సిల్‌లోని 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు మంగళవారం తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు పంపారు. దళితులపై దౌర్జన్యాలపై వేదన వ్యక్తం చేస్తూ పార్టీ ఎమ్మెల్యే పనా చంద్ మేఘ్‌వాల్‌కు మద్దతు ఇచ్చారు. జలోర్‌లో తాగునీటి కుండను తాకినందుకు ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడం వల్ల తొమ్మిదేళ్ల దళిత బాలుడు మృతి చెందిన రెండు రోజుల తర్వాత బరన్-అత్రు ఎమ్మెల్యే సోమవారం తన రాజీనామా లేఖను గెహ్లాట్‌కు పంపారు. ఇదిలా ఉండగా, జలోర్‌లోని సురానా గ్రామంలో బాలుడి ఇంటికి రాజకీయ నేతలు దారులు కట్టారు.
కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం బాలుడి ఇంటికి చేరుకుని దళితుల విశ్వాసాన్ని గెలుచుకోవడానికి బలమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోస్తారా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మమతా భూపేష్, పీడబ్ల్యూడీ మంత్రి భజన్ లాల్ జాతవ్, విపత్తు నిర్వహణ సహాయ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్‌తో కలిసి బాలుడి ఇంటికి వెళ్లారు.ఆయన కుటుంబానికి పార్టీ ఫండ్ నుండి ₹ 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. త్వరిత విచారణకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మేఘ్వాల్ చర్యకు మద్దతుగా బరన్ మునిసిపల్ కౌన్సిల్‌లోని 25 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లలో 12 మంది దళితులు, అణగారిన వర్గాలపై దౌర్జన్యాలపై వేదన వ్యక్తం చేశారు. దళితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేకు మద్దతుగా రాజీనామా లేఖలు పంపామని కౌన్సిలర్ యోగేంద్ర మెహతా వెల్లడించారు. రోహితాశ్వ సక్సేనా, రాజారాం మీనా, రేఖా మీనా, లీలాధర్ నగర్, హరిరాజ్ ఎర్వాల్, పీయూష్ సోనీ, ఊర్వశి మేఘవాల్, యశ్వంత్ యాదవ్, అన్వర్ అలీ, జ్యోతి జాతవ్, మయాంక్ మథోడియా తమ రాజీనామా లేఖలను పంపినట్లు ఆయన తెలిపారు. వారు తమ రాజీనామా లేఖల కాపీలను బుధవారం కోట డివిజనల్ కమిషనర్‌కు సమర్పిస్తారని మెహతా తెలిపారు.ఇదిలావుండగా, కోటాలో ఇటావా మున్సిపల్ కౌన్సిల్‌కు చెందిన నామినేటెడ్ కౌన్సిలర్ సురేష్ మహావార్ కూడా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు.
Also Read
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
Super Vasuki Train: ఆరు ఇంజిన్‌లు.. 295 బోగీలు.. దేశంలో అతి పెద్ద పొడవైన రైలు ఇదే..!!
మరోవైపు ఈ దారుణోదంతంపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) మంగళవారం తాఖీదు జారీ చేసింది. బాలుడి మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి చోటుచేసుకుందో తమకు ఏడు రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు- బాలుడి మృతి రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ఉపాధ్యాయుడు కొట్టిన అనంతరం ఈ నెల 13న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు స్పందించారు. ఆ బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించారు.
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..