Bhatti Vikramarka: భద్రాచలం నియోజకవర్గంలో ముంపు గురైన ప్రాంతాలను, నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ముంపు ప్రాంతాల్ని సందర్శించలేదని, వారికి సహాయం అందించలేదని మండిపడ్డారు. ముంపు అంచనా కూడా వేయలేదన్నారు. క్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నీట మునిగిపోయాయన్నారు. భద్రాచలం పినపాక నియోజకవర్గాల్లో అడుగడుగునా పోలీసులు అడ్డుకొని ఇల్లందు గెస్టహౌస్‌లో వదిలి వెళ్లారని ఆయన ఆగ్రహించారు. మమ్మల్ని ఆటంకవాదుల్లాగా ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ వదిలి వెళ్లారన్నారు. గెస్ట్ హౌస్ తాళాలు లేవని, రెండు గంటల పాటు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. బరాబర్ మొదలుపెట్టిన కార్యక్రమం పూర్తి చేస్తామని ఆయన అన్నారు. సందర్శనకు బయలుదేరిన మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తాము బరాబర్ సందర్శిస్తామన్నారు. ప్రాజెక్టును సందర్శించడానికి బయలుదేరుతున్నామన్నారు.
Ghulam Nabi Azad Quits: కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన గులాం నబీ ఆజాద్..
మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు బయల్దేరిన సీఎల్పీ బృందాన్ని భద్రాచలంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడే బైఠాయించారు కాంగ్రెస్ నేతలు. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో భట్టి విక్రమార్క, సీతక్క, జీవన్ రెడ్డిలను మణుగూరు క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేసి పాల్వంచ పీఎస్‌కు తరలించారు. అనంతరం వారిని ఇల్లందు గెస్ట్ హౌస్‌కు తరలించారు.