Rajasthan Accident: ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టిన ట్రక్కు.. 6గురు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Accident: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పాలి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పాలి జిల్లాలోని సుమేర్‌పూర్ ప్రాంతంలో యాత్రికులను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితులు ట్రాక్టర్ ట్రాలీలో జైసల్మేర్ జిల్లాలోని రామ్‌దేవ్రా ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా, వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది.
మరోవైపు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. “రాజస్థాన్‌లోని పాలిలో జరిగిన ప్రమాదం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలను తలచుకుంటే బాధగా ఉంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.
Also Read
lightning Strikes: ఒడిశాలో స్కూల్ భవనంపై పిడుగుపాటు.. విద్యార్థులకు తీవ్రగాయాలు
ప్రమాదంలో మృతి చెందిన వారికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ సంతాపం తెలిపారు.”రాజస్థాన్‌లోని పాలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు