Monkeypox Test Kit: మొట్టమొదటి స్వదేశీ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkeypox Test Kit: మంకీపాక్స్ పరీక్ష కోసం స్వదేశీంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (AMTZ)లో ప్రారంభించారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా బయో-మెడికల్స్ అభివృద్ధి చేసిన ఈ కిట్‌ను విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో కేంద్ర ముఖ్య శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ విడుదల చేశారు. ఎర్బా-ట్రాన్స్ఆసియా మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ అత్యంత సున్నితమైనదని, అయితే మెరుగైన ఖచ్చితత్వం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రైమర్, ప్రోబ్‌తో సులభంగా ఉపయోగించగల పరీక్ష అని ఆయన వెల్లడించారు.
lumpy Skin Disease: లంపీ స్కిన్ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించాలి.. సీఎం అశోక్ గెహ్లాట్ డిమాండ్
Also Read
- Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
- Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
- Supreme Court: డాక్టర్లపై దాడి చేసే రాజకీయ నాయకుల్ని వెంటనే అరెస్ట్ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ ఆందోళన కలిగించే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మంకీపాక్స్‌ను ముందస్తుగా గుర్తించడంలో, మెరుగైన నిర్వహణలో కిట్ సహాయపడుతుందని ట్రాన్స్ఆసియా వ్యవస్థాపక-చైర్మన్ సురేష్ వజిరానీ చెప్పారు. మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తోందని.. ఇప్పటికే 75 దేశాలను చుట్టేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రకటించింది. మంకీ పాక్స్‌ను గుర్తించేందుకు ఈ కిట్‌ను తొలిసారి భారత్‌లో తయారు చేసి.. మేకిన్ ఇండియాలో భాగస్వాములమయ్యామని సురేశ్ వజిరాని వెల్లడించారు. పూర్తిగా దేశీయ సాంకేతికత పరిజ్ఞానంతోనే ఈ కిట్ రూపొందించినట్టు వివరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సైంటిఫిక్ సెక్రటరీ అరబింద మిత్ర, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, బయోటెక్నాలజీ విభాగం సలహాదారు అల్కా శర్మ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
-
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
-
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
-
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ లవర్స్ గెట్ రెడీ
-
Mahishasuramardhini: గీతా ఆర్ట్స్‌లో డైరెక్టర్ క్రిష్ కెరీర్లోనే డిఫరెంట్ సినిమా? టైటిల్ ఇదేనా!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!