కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ బుధవారం అన్నారు. ప్రస్తుతం తనకు రెండు పనులు అప్పగించబడ్డాయని ఆయన తెలిపారు.
బిహార్‌లో ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడుల తర్వాత ఆ రాష్ట ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. కేంద్రంలోని అధికార పక్షం తమకు ఆధిక్యత లేని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలపై కేంద్ర ఏజెన్సీలను పంపుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీకి ముగ్గురు అల్లుళ్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా నెగ్గింది. విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
వచ్చే నెలలో జరగనున్న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నట్లు జపాన్ మీడియా బుధవారం వెల్లడించింది. జపాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 27న అబేకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.
బిహార్‌లో కొత్తగా ఏర్పడిన సర్కారు బలపరీక్షకు ముందే కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తనపై అధికార 'మహాగట్బంధన్' (మహాకూటమి) ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో కూడిన ప్రసంగం అనంతరం సభా వేదికపై తన రాజీనామాను ప్రకటించారు.
బిహార్‌లో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బలపరీక్ష రోజే ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. బిహార్‌లో ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, ముగ్గురు ఎంపీలు అష్ఫాక్ కరీం, ఫయాజ్ అహ్మద్, సుబోధ్ రాయ్‌లకు సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించారు.