జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వం రద్దయింది. అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బయాస్‌కు సిఫారసు చేసింది. శుక్రవారం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కుప్పానికి నీళ్లివ్వని ముఖ్యమంత్రి జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మూడో రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని మోడల్ కాలనీలో ఆయన పర్యటించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీరుతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేసిన కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూ కశ్మీర్‌లో కొత్తగా పార్టీ పెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. బీజేపీలో చేరకుండా.. జమ్మూకశ్మీర్‌లో సొంత పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఆజాద్ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్ అక్టోబర్ 7, 2022న ప్రారంభమై డిసెంబర్ మధ్యకాలం వరకు కొనసాగనుంది.
కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ కలలను, ఆశలను నెరవేర్చడం ద్వారా జాతి నిర్మాణంలో శ్రామిక శక్తి ప్రధాన పాత్ర పోషిస్తోందని మోడీ కొనియాడారు. తిరుపతిలో రెండు రోజుల కార్మిక సదస్సును ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్ వేదికగా ప్రారంభించారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలోనే మొదటిసారిగా మైక్రోసాఫ్ట్ సంస్థ విద్యార్థులకు శిక్షణ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలని ఆయన అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ నేతృత్వంలో పలు కీలక హోదాల్లో పని చేసిన 73 ఏళ్ల వయసున్న ఆజాద్.. దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో కొనసాగిన అనుబంధాన్ని తెంచేసుకున్నారు. గత రెండు మూడేళ్లగా కాంగ్రెస్ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని ప్రదర్శించారు. మరో వైపు తాను బీజేపీలో చేరిక మీడియా ఊహాగానాలపై వ్యంగ్యం ప్రదర్శించారు.
కస్టమర్ అనుమతి లేకుండా ఆర్డర్ చేసిన ఫుడ్ క్యాన్సిల్ చేసినందుకు జొమాటో సంస్థకు చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల కమిషన్ షాకిచ్చింది. ఆర్డల్ క్యాన్సిల్ చేసినందుకు రూ.10వేల జరిమానా చెల్లించాలని ఆదేశించడంతో పాటు ఒకరోజు ఉచితంగా భోజనాన్ని అందించాలని ఆదేశించింది.
కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం-2022కు డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపికయ్యారు. ఈ ఏడాదిగాను 22 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. పత్తిపాక మోహన్ రాసిన 'బాలలతాత బాపూజీ' గేయ కథకు ఈ పురస్కారం దక్కింది.