Yacht Sinks Off: చూస్తుండగానే సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yacht Sinks Off: సముద్రంలో అనేక కారణాల వల్ల ఓడలు, పడవలు మునిగిపోతుంటాయి. కొన్ని సార్లు సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల, సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల ఎన్నో సార్లు మునిగిపోతుంటాయి. తాజాగా వాతావరణ కారణాల వల్ల ఓ భారీ నౌక సముద్రంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇటాలియన్ కోస్ట్ గార్డ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఓ సూపర్ నౌక పూర్తిగా మధ్యధరా సముద్రంలో మునిగిపోయినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వివరాల ప్రకారం.. ఇటాలియన్ కోస్ట్ గార్డుకు చెందిన నౌక గల్లిపోలీ నుంచి మిలాజోకు ప్రయాణిస్తుంది. అప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. అందరు చూస్తుండగానే.. 40 మీటర్ల భారీ పడవ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా భయంతో వణికిపోయారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిలో తేలుతున్న 9 మందిని రక్షించారు. ఆ తొమ్మిది మందిలో నలుగురు ప్రయాణికులు కాగా.. మరో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఈ నౌక మునగడానికి గల కారణాల గురించి విచారణ ప్రారంభమైంది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
Excise Policy Probe: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై మనీలాండరింగ్ కేసు
ఇది వాతావరణం, సముద్ర పరిస్థితులు క్షీణించడం వల్ల సముద్రంలో మునిగిపోయిందని ఇటాలియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. 2007లో మొనాకోలో నిర్మించిన ఈ పడవకు ‘సాగా’ అని పేరు పెట్టినట్లు డైలీ మెయిల్ తెలిపింది. తీరానికి 14.5 కిలోమీటర్ల దూరంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొంది. మునిగిపోయిన నౌకను సురక్షితంగా ఓడరేవుకు లాగేందుకు కోస్ట్ గార్డ్ ఒక టగ్‌బోట్‌ను పంపింది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ భారీ నౌక మునిగిపోయింది. ఓడ మునిగిపోవడానికి గల కారణాన్ని కనుగొనడానికి అధికారులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. నౌక మునిగిపోయే ఫుటేజీని కూడా విశ్లేషిస్తున్నారు.
Nei giorni scorsi, la #GuardiaCostiera di #Crotone ha coordinato operazioni di salvataggio di passeggeri ed equipaggio di uno yacht di 40m, affondato a 9 miglia al largo di #CatanzaroMarina.
Avviata inchiesta amministrativa per individuarne le cause. #SAR #AlServizioDegliAltri pic.twitter.com/kezuiivqsM— Guardia Costiera (@guardiacostiera) August 22, 2022
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!