Earthquake: ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో మంగళవారం అర్థరాత్రి సముద్రగర్భంలో భారీ భూకంపం సంభవించింది, దీనివల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆస్తి నష్టం, ప్రాణనష్టం గురించి తక్షణ నివేదికలు లేవు. దక్షిణ సుమత్రా ప్రావిన్స్‌లోని పాగర్ ఆలం నగరానికి దక్షిణంగా 117 కిలోమీటర్ల (72 మైళ్లు) దూరంలో 59 కిలోమీటర్ల (36 మైళ్లు) లోతులో 6.0 తీవ్రతతో భూకంపం కేంద్రీకృతమైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
చాలా మంది నివాసితులు తమ ఇళ్ల నుండి ఎత్తైన ప్రదేశాలకు పరుగులు తీశారని, అయితే సునామీ ప్రమాదం లేదని సందేశాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇండోనేషియా వాతావరణ శాస్త్రం, క్లైమాటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీ భూకంపాన్ని 6.5 తీవ్రతతో సంభవించిందని తెలిపింది.
Yacht Sinks Off: చూస్తుండగానే సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక.. వీడియో వైరల్
ఇండోనేషియా 270 మిలియన్ల జనాభా కలిగిన విస్తారమైన ద్వీపసమూహం. అగ్నిపర్వతాలతో పాటు పలు కారణాల వల్ల భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు, సునామీలు తరచుగా సంభివిస్తూ ఉంటాయి. ఫిబ్రవరిలో పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 25 మంది మరణించగా.. 460 మందికి పైగా గాయపడ్డారు. జనవరి 2021లో పశ్చిమ సులవేసి ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 100 మందికి పైగా మరణించగా.. దాదాపు 6,500 మంది గాయపడ్డారు.