దేశంలోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయడానికి బీజేపీ 6,300 కోట్ల రూపాయలను ఖర్చు చేయకపోతే, ఆహార పదార్థాలపై కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు.
నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్య కేసులో ప్రధాన నిందితులు సుఖ్వీందర్ సింగ్, సుధీర్ సాంగ్వాన్‌లను 10 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. గోవాలోని అంజునా బీచ్‌లో కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్‌తో పాటు మాదకద్రవ్యాల వ్యాపారి దత్‌ప్రసాద్ గాంకర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
రెండు రోజుల కిందట గోవా పర్యటనలో టిక్ టిక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత గుండెపోటుగా భావించిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి రెస్టారెంట్‌లో పార్టీలో పాల్గొన్న సమయంలో సహాయకులు ఆమెకు బలవంతంగా ఓ రసాయనాన్ని ఎక్కించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాధినేతల్లో మళ్లీ నంబర్ వన్‌గా నిలిచారు. భారత ప్రధాని మోడీని 75 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్థ వెల్లడించింది. ప్రపంచ నాయకుల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోడీనే ముందున్నారని స్పష్టం చేసింది.
మంత్రి బొత్స సత్యనారాయణతో సీపీఎస్ ఉద్యోగుల చర్చలు ముగిశాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని సీపీఎస్ ఉద్యోగులు వెల్లడించారు. చాలా ఆశలతో చర్చలకు వచ్చిన తమకు సర్కారు పాత విషయాలనే చెప్పిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం జీపీఎస్‌పైనే చర్చించాలని చెప్పిందని ఉద్యోగులు తెలిపారు.
చిరిగిపోయిన రూ.200 నోటు తీసుకునేందుకు నిరాకరించాడని పిజ్జా డెలివరీ బాయ్‌ని ఓ వ్యక్తి తుపాకితో కాల్చాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
బీజేపీపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తున్న సీరియర్ కిల్లర్ బీజేపీ అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారును కూడా కూల్చేందుకు బీజేపీ యత్నించిందని, బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి లాక్కోవాలని యత్నించిందని.. కానీ ఆప్ నేతలు వారి బుట్టలో పడలేదని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ చేస్తున్నారు. పదవీ విరమణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తనకు జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తుచేసుకున్నారు. జీవితంలో తనకు విద్య నేర్పిన గురువులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాకు మద్దతుగా కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.
కుప్పం తన చేతిలోంచి జారిపోతుందని చంద్రబాబుకు భయం పట్టుకున్నట్లు ఉందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 33 ఏళ్లుగా కుప్పం శాసనసభ్యుడిగా ఉన్న ఆయన.. ఈ మధ్యే కుప్పం వెళ్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో చంద్రబాబుకి గెలుపే లేదన్నారు.