కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల్లోనే కొత్త పార్టీ స్థాపిస్తారని.. గులాం నబీ ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన జీఎం సరూరీ వెల్లడించారు.
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బదులుగా అధికారిక సిబ్బంది సంతకం చేసినందున ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కార్యాలయం 47 ఫైళ్లను తిరిగి ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) తిరిగి పంపింది.
రాబోయే 2023 మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా శనివారం ప్రకటించారు.
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసాకు చెందిన రోవర్ రెడ్ ప్లానెట్‌లోని జెజెరో క్రేటర్‌లో అద్భుతమైన మార్టిన్ శిలలను కనుగొంది. అవి నీటికి సంబంధించిన జాడలను కలిగి ఉండవచ్చని న్యూస్‌వీక్ నివేదిక తెలిపింది.
బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని, వారు దేశాన్ని కూడా అలాగే ఉంచాలని చూస్తున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మూసివేసినట్లే దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయే సమయంలో చెల్లుబాటు అయ్యే అంశాలను లేవనెత్తారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న ఓడ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
అర్జెంటీనా వైమానిక దళం కోసం భారత్‌లో తయారైన తేజస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌పై అర్జెంటీనా ఆసక్తిని భారతదేశం శుక్రవారం అంగీకరించింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అర్జెంటీనాలో రెండు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా తేజస్‌పై చర్చలు జరిగాయి.
ఓ మందుబాబు చేసిన తుంటరి పనికి దుబాయ్ వెళ్లాల్సిన విమానం ఆగింది. ఆగిపోవడమే కాకుండా ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులను కూడా ఉరుకులు పరుగులు పెట్టించాడు. ఇంతకీ అతను చేసిన పని ఏంటంటే.. శనివారం నాడు తన కుటుంబ సభ్యులను దేశం నుండి బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలనుకున్న ఓ తాగుబోతు.. దుబాయ్‌కి వెళ్లే ఓ ప్రైవేట్ క్యారియర్‌కు బూటకపు బాంబు బెదిరింపు చేసి పోలీసుల వలలో పడ్డాడు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేసిన నేపథ్యంలో జార్ఖండ్ రాజకీయాల్లో అస్థిరత నెలకొన్న సంగతి తెలిసిందే. యూపీఏ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని హేమంత్ సోరెన్ ఆరోపించారు.