అందరూ చూస్తుండగానే పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. ఆమె ఇంట్లో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ పూర్తిగా దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో జరిగింది. భారత్ ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద నౌక కూడా ఇదే కావడం విశేషం.
దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లలో కొత్తగా6,168 కేసులు నమోదు అయ్యాయి.
హర్యానాలో బీజేపీ నేత, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు దారుణ హత్యకు గురయ్యారు. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ నేత సుఖ్‌బీర్ ఖతానాపై తూటాల వర్షం కురిపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీకి అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. అవినీతి, పెగాసస్ స్పైవేర్, అమెరికాకు నగదు తరలింపు తదితర ఆరోపణలతో ఓ భారతీయ అమెరికన్ వైద్యుడు దావా వేశారు.
చెవినొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతి తన ఎడమచేతిని కోల్పోయిన ఘటన బిహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం.. యువతి ప్రాణాలకే ముప్పును తెచ్చిపెట్టింది.
మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటకలోని మురుగ మఠం ప్రధానార్చకుడు శివమూర్తి మురుగ శరణరును శుక్రవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆయనను చిత్రదుర్గ జిల్లా జైలుకు తరలించారు. పోలీసులు రేపు ఓపెన్ కోర్టులో పోలీస్ రిమాండ్ కోరనున్నారు.
రక్షణ రంగంలో భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటే రానే వచ్చింది. ఇప్పటిదాకా భారత్ వద్ద ఉన్న నౌకలన్నీ విదేశాలను నుంచి దిగుమతి చేసుకున్నవే కాగా.. ఇప్పుడు అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ నిర్మించింది.
మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 'బొగ్గు అక్రమాస్తుల కుంభకోణం'పై విచారణకు రావాలని సమన్లు జారీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు.