Arjun Sarja: నటుడు కావడం మా నాన్నకు ఇష్టం లేదు.. అర్జున్ సర్జా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arjun Sarja: యాక్షన్ కింగ్‌గా తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన నటుడు అర్జున్ సర్జా. తాజాగా ఆయన తన కూతురు ఐశ్వర్య అర్జున్‌ను హీరోయిన్‌గా వెండి తెరపై పరిచయం చేస్తూ ‘సీతా పయనం’ అనే సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించారు. ఈ నేపథ్యంలో జరిగిన ‘సీతా పయనం’ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా నాన్నగారి పేరు శక్తి ప్రసాద్. ఆయన కన్నడ సినిమాల్లో పేరుపొందిన నటుడు. సుమారుగా 200 లకు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. కానీ మా నాన్నగారికి నేను సినిమా పరిశ్రమలోకి రావడం ఇష్టం లేదు. ఆయనకు నేను ఒక పోలీసు అధికారిని కావాలని కల ఉండేది. కానీ నేను మీ ముందు ఇలా నటుడిగా ఉన్నాను’ అని అన్నారు. సీతా పయనం… కేవలం రోడ్ ట్రిప్ కాదు. అది భావోద్వేగాల యాత్ర అన్నారు. తండ్రి-కూతురి మధ్య ఉన్న అనుబంధం, కుటుంబ బంధాల బలం, ప్రేమ, అన్నీ ఈ చిత్రంలో కనిపిస్తాయన్నారు.
READ ALSO: Ishan Kishan: ఇషాన్ కిషన్ మనసు దోచిన సుందరి ఈమెనే.. త్వరలో పెళ్లి బాజాలు!
Also Read
ఇకపోతే ఆయన సినిమా కెరీర్ గురించి చూస్తే.. యాక్షన్ కింగ్‌గా అర్జున్ సర్జాకు ఉన్న గుర్తింపు సామాన్యమైనది. ఆయన చేసిన సినిమాలు భాషలకు అతీతంగా అభిమానులకు చేరువ అయ్యాయి. తాజాగా ఆయన తన దర్శకత్వంలో తన కుమార్తె ఐశ్వర అర్జున్‌గా హీరోయిన్‌గా వెండి తెరకు పరిచయం చేశారు. ‘సీతా పయనం’ అనే సినిమా ద్వారా ఐశ్వర అర్జున్ హీరోయిన్‌గా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈసినిమా రోడ్ ట్రిప్ నేపథ్యంలో, కుటుంబ బంధాలు, ప్రేమ, ఎమోషన్‌తో కూడిన థ్రిల్లర్. నిరంజన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా… ప్రస్తుతం థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరిస్తోంది.
READ ALSO: Pakistan vs India T20 2026: బాబర్ అజామ్ లేకుండా భారత్‌తో పాక్ మ్యాచ్? కారణం ఇదే!
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!