ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌ను సీబీఐ అధికారులు ఇవాళ ఓపెన్ చేశారు. ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సిసోడియాకు లాకర్ ఉండగా.. దర్యాప్తుకు సంబంధించి ఆ లాకర్‌ను సీబీఐ సోదా చేసింది.
ముఖానికి ముసుగు ధరించి, బ్యాగులో నుంచి తుపాకీ తీసి తాళాలు అడిగి, తలపై తుపాకీ గురిపెట్టి చంపేస్తానని బెదిరించి దొంగతనాలకు పాల్పడడం సాధారణంగా సినిమాలో చూస్తుంటాం. అలా సినీఫక్కీలోనే ఓ భారీ చోరీ జరిగింది.
దాయాది దేశం పాకిస్థాన్‌ను భీకర వరదలు అతలాకుతలం చేస్తు్న్నాయి. దేశంలోని సగానికి పైగా భూభాగం వరదను ఎదుర్కొంటోందని ఓ పాక్ మంత్రి వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తమిళనాడు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రిటైర్ జడ్జి జస్టిస్ ఆరుముగసామి ఇచ్చిన నివేదికపై చర్చించిన కేబినెట్.. జయలలిత నెచ్చెలి సహా మరికొందరిని విచారించేందుకు న్యాయనిపుణులతో చర్చించాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఆ పోటీలో బరిలో దిగాలని శశిథరూర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మళయాళ దిన పత్రిక "మాతృభూమి"లో ఆయన ఇటీవలే ఓ ఆర్టికల్ రాశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక గురించి ప్రస్తావించారు. పూర్తి పారదర్శకంగా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల జరగాలని ఆయన చెప్పారు.
అభ్యర్థుల ప్రయోజనం కోసం మరిన్ని సీట్లను చేర్చడానికి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సోమవారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) కౌన్సెలింగ్‌ను రీషెడ్యూల్ చేసింది.
రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు మతపెద్ద ప్రకటించడంపై షియా మతపెద్ద ముక్తాదా అల్-సదర్ మద్దతుదారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 20కి చేరుకుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.