Murugha Mutt Seer: మైనర్లపై లైంగిక వేధింపులు.. మురుగ మఠాధిపతికి జ్యుడీషియల్ కస్టడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murugha Mutt Seer: మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటకలోని మురుగ మఠం ప్రధానార్చకుడు శివమూర్తి మురుగ శరణరును శుక్రవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
ఆయనను చిత్రదుర్గ జిల్లా జైలుకు తరలించారు. పోలీసులు రేపు ఓపెన్ కోర్టులో పోలీస్ రిమాండ్ కోరనున్నారు.ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసులో శరణారావును కర్ణాటక పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కర్ణాటకలోని మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణరును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మైనర్లను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అరెస్టు చేసినట్లు కర్ణాటక శాంతిభద్రతల విభాగం ఏడీజీపీ అలోక్ కుమార్ వెల్లడించారు. అనంతరం వైద్యపరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించామని, ఆ తర్వాత జిల్లా సెషన్స్ జడ్జి ఇంటికి తీసుకెళ్లి ఆమె ముందు హాజరుపరిచామని తెలిపారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారని, చిత్రదుర్గ పోలీస్ స్టేషన్‌కు తరలించామని చెప్పారు.
ర్ణాటక చెందిన ఇద్దరు బాలికలు మైసూరులోని ఒక స్వచ్ఛంద సంస్థ వద్దకు వెళ్లి తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి అక్కడి అధికారులకు వివరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మురుగ మఠాధిపతిని అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒకరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం వల్ల మురుగ మఠాధిపతిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అరెస్టు నేపథ్యంలో చిత్రదుర్గలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు కుట్రలో భాగమని, తాను చట్టానికి కట్టుబడి ఉన్నానని, విచారణకు సహకరిస్తానని మురుగ మఠాధిపతి తెలిపారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను స్థానిక కోర్టు సెప్టెంబరు 2కు వాయిదా వేసింది.
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
చిత్రదుర్గలోని ప్రభావవంతమైన మురుగ మఠం పీఠాధిపతిపై మైనర్ బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.ఎఫ్ఐఆర్ ప్రకారం, బాలికలు రెండేళ్లుగా వేధింపులకు గురయ్యారు. ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ నేతలు డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్‌తో కలిసి చిత్రదుర్గలోని మురుగ మఠాన్ని సందర్శించారు. మురుగ మఠం కూడా ఒక ప్రభావవంతమైన సంస్థగా ప్రసిద్ధి చెందింది.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!