కేరళ జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ బెయిల్ పిటిషన్‌పై సమాధానమివ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్. జస్టిస్ ఎస్. రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం సిద్ధిక్ కప్పన్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లోని హూస్టన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సొంత ప్రభుత్వంపైనే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి ప్రసగించారు.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బండాకు చెందిన మహేష్ కుమార్ తివారీ తన ఐదుగురు కుటుంబ సభ్యులను చంపేశాడు.
గత వారం కాంగ్రెస్ నుంచి వైదొలిగిన గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ "అర్ధరహితంగా" ఉందని ఆరోపించారు. జీ23 లెటర్ రాయడమే రాహుల్ ఆగ్రహానికి కారణమని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తాను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని, తన అవసరం లేదని కాంగ్రెస్ అనుకుందని.. అందుకే న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి దాయాదుల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గత టీ20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారంగా టీమిండియా ఘన విజయాన్ని సాధించింది.
జై షా.. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్.. అంతకు మించి కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా కుమారుడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కనిపించిన ఓ దృశ్యం.. ఇప్పుడు కొత్తగా వివాదాలకు కేంద్రబిందువు అయింది. జై షా చుట్టూ వివాదాలు ఇప్పుడిప్పుడే ముసురుకుంటోన్నాయి.
ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దుబాయ్‌లో 80 మిలియన్ల డాలర్ల విలువ గల బీచ్-సైడ్ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది నగరంలోనే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్ అని ఒప్పందం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు.