Haryana: ముఖ్యమంత్రి సన్నిహితుడు, బీజేపీ నేత దారుణహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: హర్యానాలో బీజేపీ నేత, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు అత్యంత సన్నిహితుడు దారుణ హత్యకు గురయ్యారు. ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ నేత సుఖ్‌బీర్ ఖతానాపై తూటాల వర్షం కురిపించారు. సుఖ్‌బీర్ ఖతానాను అందరూ సుఖిగా పిలుస్తారు. కాగా ఆయన హత్య గురించి తెలుసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. రితోజ్ గ్రామానికి చెందిన సుఖి నిన్న తన స్నేహితుడితో కలిసి గురుగ్రామ్ సదర్ బజార్ ప్రాంతంలోని ఓ క్లాత్ షోరూముకు వెళ్లారు. అక్కడే కాచుకుని ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. గాయపడిన ఆయన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
Fire Accident: లారీలో పేలిన 300కు పైగా గ్యాస్ సిలిండర్లు.. పూర్తిగా రోడ్డు ధ్వంసం
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
సోహనా మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడైన సుఖ్‌బీర్ ఖతానా జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండగానే ఈ ఘటన జరిగింది. స్నేహితుడు రాజేందర్‌తో కలిసి కారులో గురుద్వారా రోడ్డులోని రేమండ్ షోరూమ్‌కు సుఖి వెళ్లగా మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో ఆయనపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన తర్వాత అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు క్లాత్ షోరూమ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు బ్లాక్ టి షర్టులు ధరించగా, ఒకరు వైట్ చెక్ షర్ట్, మరొకరు క్యాప్, మరొకరు రెడ్ షర్ట్ ధరించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సుఖ్‌బీర్ ఖతానా అత్యంత సన్నిహితుడు.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!