corona cases in india: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 5,221 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే 5,975 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. కొవిడ్ బారిన పడి 15 మంది చనిపోయారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.71శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో పాటు మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.11గా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల దిగువకు చేరుకుంది. ప్రస్తుతం 47,176 యాక్టివ్ కేసులు ఇండియాలో ఉన్నాయి.
కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 5,28,165 మంది మరణించగా.. 4,39,25,239 మంది కొవిడ్ బారి నుంచి బయటపడ్డారు. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 44,505,801కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 2.82 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అర్హులైన వారికి 215.26 కొవిడ్ వ్యాక్సినేషన్ డోసులను అందించారు. నిన్న ఒక్క రోజే 30,76,305 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చారు. మొత్తంగా గడిచిన 24 గంటల్లో 1,84,965 కరోనా నిర్థారణ టెస్టులు చేశారు.
Gyanvapi Mosque Case: వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో నేడు కీలక నిర్ణయం
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగాకొత్తగా 2,88,472 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 627 మరణాలు చోటు చేసుకున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 61,34,01,483కు చేరుకుంది. మరణాల సంఖ్య 65,16,287గా ఉంది. ప్రస్తుతం జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోలనే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ దేశాల్లో లక్షల సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.