Saudi Arabia: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి రాతపూర్వక సందేశాన్ని అందజేశారు. దీంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఆయనకు వివరించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించేందుకు జైశంకర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సౌదీ అరేబియా చేరుకున్నారు. విదేశాంగ మంత్రిగా సౌదీ అరేబియాకు రావడం ఇదే తొలిసారి.
ఆదివారం జెడ్డాలో సౌదీ యువరాజును కలిశారు.ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రధాని మోడీ నుంచి లిఖితపూర్వక సందేశాన్ని అందుకున్నారని సౌదీ అధికారిక ప్రెస్ ఏజెన్సీ నివేదించింది. జెడ్డాలోని యువరాజు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ యువరాజును కలిసి లిఖితపూర్వక సందేశాన్ని అందజేసినట్లు అది తెలిపింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించుకునేందుకు ఉన్న అవకాశాలపై సమీక్షించారని, తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు వాటి కోసం చేస్తున్న ప్రయత్నాలపై చర్చించారని పేర్కొంది.
Ayodya Temple: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి రూ. 1,800 కోట్లు
“ఈ సాయంత్రం జెడ్డాలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలియజేసారు. ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతి గురించి తెలియజేశారు. సంబంధాల గురించి ఆయన దృష్టి సారించినందుకుధన్యవాదాలు” అని జైశంకర్ సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. అంతకు ముందు రియాద్‌లో సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమస్యలపై చర్చించారు. G-20, బహుపాక్షిక సంస్థలలో కలిసి పనిచేయడానికి అంగీకరించారు. భారతదేశం,సౌదీ అరేబియా శతాబ్దాల నాటి ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తూ సత్సంబంధాలు, స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నాయి. సౌదీ అరేబియా భారత్‌కు నాల్గవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.