గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
శుక్రవారం ఉజ్బెకిస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల సమావేశంలో భారత్ మార్కెట్‌లో రష్యా ఎరువులు, వాణిజ్యం అజెండాలో ఉన్నాయని రష్యా వార్తా పత్రిక క్రెమ్లిన్ వెల్లడించింది.
పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో కొంత మంది వ్యక్తులు సాధువులపై విచక్షణారహితంగా దాడి చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈరోజు ప్రశ్నిస్తోంది.జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం మందిర్ మార్గ్ కార్యాలయానికి వచ్చారు.
గోవాలో హస్తం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 8 మంది శాసనసభ్యులు హస్తానికి గుడ్‌బై చెప్పనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం నాడు బీజేపీలో చేరనున్నట్లు గోవా బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే తెలిపారు.
తమిళనాడు ఎంపీ, డీఎంకే నేత ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుమతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. డీఎంకే నేత ఎ.రాజా హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆయన విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ ఆరోపించింది.
జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూంఛ్ జిల్లాలోని సావ్జియాన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడిన ఘటనలో.. 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మంది గాయాల పాలయ్యారు.
భారత తీర రక్షక దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్‌లో మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బోట్ పట్టుబడింది. పడవ నుంచి 200 కోట్ల రూపాయల విలువచేసే 40 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,108 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 31 మంది ప్రాణాలు కోల్పోయారు.