రెండు సంవత్సరాల కొవిడ్ పరిస్థితుల తర్వాత ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 22వ శిఖరాగ్ర సమావేశం శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం సమర్‌కండ్ చేరుకున్నారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటి నోరా ఫతేహి గురువారం ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ముందు హాజరయ్యారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఆప్ సర్కారును మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆపరేషన్ వీడియోను బీజేపి విడుదల చేసింది.
కెనడాలోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ ఆలయ గోడలపై గుర్తు తెలియని దుండగులు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కెనడాలోని భారత హైకమిషన్ ఈ సంఘటనను ఖండించింది.
న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గత వారం జరిగిన సంయుక్త సమావేశంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును తక్షణమే సవరించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఇద్దరు యువతులు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిపై లైంగికంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి మండిపడ్డారు.