దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,422 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రమాదానికి గురయ్యారని, అయితే ఆయన క్షేమంగా ఉన్నారని ఆయన ప్రతినిధి తెలిపారు.
ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH)కి అనుబంధంగా ఉండి, వలసదారులను హతమార్చడంలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారం అర్ధరాత్రి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.
మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లాలో.. తమ కుమార్తెపై జరిగిన దారుణానికి న్యాయం జరగకపోతే ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేయబోమని ఓ కుటుంబం పట్టుబట్టి కూర్చొంది. దహన సంస్కారాలు జరపకుండా మృతదేహాన్ని ఉప్పుతో కప్పివేసి 45 రోజులుగా అలాగే ఉంచారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టారు. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్రలో రాహుల్‌గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు.
షాంఘై సహకార సంస్థ(SCO) సభ్యదేశాల 22వ శిఖరాగ్ర సదస్సు గురువారం ఉజ్బెకిస్తాన్‌లోని చారిత్రక నగరం సమర్‌కండ్‌లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు నేడు,రేపు రెండు రోజుల పాటు జరగనుంది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ పన్నెండవ తరం వారసుడు ఛత్రపతి శివాజీరాజే భోసలే వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా మంగళవారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
పంజాబ్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.