Jacqueline Fernandez: 200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈరోజు ప్రశ్నిస్తోంది.జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం మందిర్ మార్గ్ కార్యాలయానికి వచ్చారు. సుకేష్‌తో ఆమెకు ఉన్న సంబంధం, అతని నుంచి ఆమెకు లభించిన బహుమతుల గురించి ఢిల్లీ పోలీసులు సుదీర్ఘమైన ప్రశ్నల జాబితాను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. జాక్వెలిన్‌ను సంప్రదించడానికి సుకేష్‌కు సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పింకీ ఇరానీ కూడా ఈరోజు విచారణలో చేరాల్సిందిగా ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ద్వారా సమన్లు అందుకుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పింకీ ఇరానీలను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Ruby Hotel Fire Accident: ఆ నలుగురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్
సెప్టెంబర్ 14న విచారణకు హాజరు కావాలని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జాక్వెలిన్‌కు సమన్లు జారీ చేయడం ఇది మూడో సారి. గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేసినా.. బిజీ షెడ్యూల్ వల్ల విస్మరించానని చెప్పుకొచ్చింది జాక్వెలిన్. సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుంచి నడిపించిన దోపిడీ దందాపై జాక్వెలిన్‌ను ప్రశ్నించనున్నారు ఢిల్లీ పోలీసులు. కాగా, మనీలాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారికి బెయిల్ ఇప్పిస్తానంటూ… అతని భార్య నుంచి 215 కోట్ల రూపాయలు బురిడీ కొట్టించాడు. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి సుఖేశ్ చంద్రశేఖర్ మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌నూ ఈడీ నిందితురాలిగా చేర్చింది. సుఖేశ్ చంద్రశేఖర్… 10 కోట్ల విలువ చేసే బహుమతులను ఆమెకు పంపినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇదే కేసులో కొన్ని రోజుల క్రితం నటి నోరా ఫతేహిని… గతంలో ఆరు గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
Jacqueline Fernandez arrives at EOW office in Delhi in connection with the conman Sukesh Chandrashekhar money Laundering case https://t.co/XFDrF8xDaB pic.twitter.com/qzkIfe9Tzh
— ANI (@ANI) September 14, 2022