SCO Summit: ఉజ్బెకిస్తాన్ చేరుకున్న ప్రధాని.. పుతిన్‌తో భేటీ కానున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SCO Summit: రెండు సంవత్సరాల కొవిడ్ పరిస్థితుల తర్వాత ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 22వ శిఖరాగ్ర సమావేశం శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం సమర్‌కండ్ చేరుకున్నారు. ఈ సదస్సు నేపథ్యంలో నాయకులు షాంఘై సహకార సంస్థ కార్యకలాపాలను సమీక్షించాలని, భవిష్యత్ సహకారం కోసం అవకాశాలను చర్చించాలని భావిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో.. ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వాణిజ్యం, ఇంధన సరఫరా పెంపు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై ఈ కూటమికి చెందిన సభ్య దేశాల నేతలు చర్చించనున్నారు.
ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోవ్‌లను కలవనున్నారు. మరికొన్ని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే, జిన్‌పింగ్‌తోనూ ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత… పుతిన్‌తో జిన్‌పింగ్ ఇక్కడ నేరుగా భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి ముందు 2019లో జూన్‌లో బిష్కేక్‌లో ఎస్‌సీవో సదస్సులో దేశాల నేతలు ప్రత్యక్షంగా పాల్గొనగా.. రెండేళ్ల తర్వాత ఈ నేతలందరూ ముఖాముఖి సమావేశం కానుండడం ఇదే ప్రథమం. బిష్కేక్‌లో సదస్సు తర్వాత రష్యా, తజికిస్థాన్ అధ్యక్షతన తదపరి రెండు శిఖరాగ్ర సమావేశాలు వర్చువల్ ఫార్మాట్‌లో జరిగాయి.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
CUET UG-2022 Results: సీయూఈటీ-యూజీ ఫలితాలు వచ్చేశాయ్..
ఉగ్రవాదం సహా ప్రాంతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారని, ఉగ్రవాద సమస్య మూలాలు ఎక్కడున్నాయన్నది ఈ బృందానికి లోతైన అవగాహన ఉందని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్ర పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉజ్బెకిస్థాన్‌కు బయలుదేరి వెళ్లేందుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వివిధ దేశాల అధినేతలతో అభిప్రాయాలు పంచుకుంటానని చెప్పారు. ఈ కూటమిని మరింత విస్తృతం చేయడం; పరస్పర, బహుముఖ ప్రయోజనాల నిమిత్తం కూటమిలో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తామన్నారు. పర్యాటక, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక రంగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని వెల్లడించారు.
1996లో ఏర్పాటైన షాంఘై ఫైవ్, 2001లో ఉజ్బెకిస్థాన్‌ను చేర్చడంతో షాంఘై సహకార సంస్థ (SCO)గా మారింది. భారతదేశం, పాకిస్తాన్ 2017లో ఇందులో చేరడం, 2021లో ఇరాన్‌ను పూర్తి సభ్యునిగా చేర్చుకోవాలనే నిర్ణయంతో ఎస్‌సీవో అతిపెద్ద బహుపాక్షిక సంస్థలలో ఒకటిగా అవతరించింది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 30 శాతం, ప్రపంచ జనాభాలో 40 శాతం వాటా కలిగి ఉంది.రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు చర్చకు రానున్నాయి. 2001లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థలో 8 దేశాలు.. చైనా, కజక్‌స్థాన్, కిర్గిజిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, భారత్, పాకిస్థాన్‌లకు పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. భారత్, పాక్‌లు 2017లో పూర్తిస్థాయి సభ్యులయ్యాయి. ఎస్‌సీవోలో పరిశీలక దేశాలుగా…అఫ్గానిస్థాన్, బెలారస్, మంగోలియా కొనసాగుతున్నాయి. కంబోడియా, నేపాల్, శ్రీలంక, తుర్కియే, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లు చర్చల్లో భాగస్వామ్య హోదాను కలిగి ఉన్నాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!