Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆపరేషన్ వీడియోని విడుదల చేసిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఆప్ సర్కారును మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆపరేషన్ వీడియోను బీజేపి విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతిపై బీజేపీ అధికార ప్రతినిధులు సుశాంషు త్రివేది, అదేష్ గుప్త మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆ వీడియోలో లిక్కర్ హోల్ సేల్ పంపిణీ చేసిన అమిత్ అరోడా ఉన్నాడు. అతను ఈ స్కాంలో ఉన్న వారి పేర్లను చెప్పాడు. ఎవరెవరికి ఎంత ఇచ్చారో, ఎంత మొత్తం మీద డబ్బులు చేతులు మారాయో వివరించాడని అన్నారు బీజేపీ నేతలు
గుజరాత్‌లో అమ్ముతున్న లిక్కర్ ఢిల్లీ నుంచే పోతోందని.. పంజాబ్‌లో విక్రయిస్తున్న లిక్కర్ కూడా అక్కడిదేనని తెలిపారు. ఢిల్లీలో ఒబేరాయివ్ హోటల్‌లో కూర్చుని ఈ లిక్కర్ పాలసీ తయారు చేశారని వివరించారు. అరుణ్ పిలై, జస్‌దీప్ కౌర్ చెడ్డా, సమీరా మహేంద్ర, అమండల్ ఇంకా కొంత కలిసి ఈ పాలసీ తయారు చేశారన్నారు. కావాలని కొంత మందికి లాభం చేకూర్చేలా ఈ పాలసీ చేశారని.. బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం కోసం కొంత మంది పెద్దలు ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టారన్నారు. ఈ పాలసీ వల్ల వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ఉన్నది లిక్కర్ స్కాంలో 9వ నిందితుడని బీజేపీ నేతలు తెలిపారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
TCS Number One: దటీజ్.. టీసీఎస్. దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్. నంబర్ వన్ పొజిషన్
ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బులను ఆప్ పంజాబ్, గోవా ఎన్నికలలో ఖర్చు చేసిందని ఆరోపించారు. ఢిల్లీలో ప్రతి వైన్ షాపు దగ్గర నుంచి 5 కోట్లు తీసుకున్నారని తెలిపారు. అవినీతిని అంతం చేస్తా అని కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు.. కానీ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఎంత లిక్కర్ అవసరమో అంత కాకుండా అంతకు మించి సప్లయ్ చేశారని తెలిపారు. బ్లాక్ దందా అంతా ఢిల్లీనుంచి సప్లయ్ అయ్యిందని… దేశంలో వివిధ రాష్ట్రాలకి సప్లయ్ అయ్యిందని ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఆయన మిత్రులకు లాభం చేకూర్చారని విమర్శించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో అన్ని విషయాలు బయట పడ్డాయన్నారు.
ముఖ్యమంత్రి పదవికికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని.. ఆయన ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడానికి అనర్హుడని అన్నారు. ఆయన బీజేపీపై చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాంలో ఉన్నవాళ్ల పేర్లను సీబీఐకి ఇస్తామన్నారు. ఢిల్లీలో ఎవరెవరు కలిశారు.. ఇక్కడికు వచ్చి ఎవరు కలిశారో తమ వద్ద ఆధారులు ఉన్నాయన్నారు. అన్ని విషయాలను కోర్టులో చెప్తామన్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!