Bar Council: బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bar Council: న్యాయమూర్తుల పదవీ విరమణ వయసుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గత వారం జరిగిన సంయుక్త సమావేశంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును తక్షణమే సవరించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. రాజ్యాంగంలో తక్షణ సవరణ జరగాలని, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 67 ఏళ్లకు పెంచాలని పేర్కొంది.
Narayana Swamy: లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళిసై రాజకీయాలు చేయాలి
Also Read
తీర్మానంపై తక్షణ చర్య కోసం తీర్మానం కాపీని భారత ప్రధాని, కేంద్ర న్యాయ శాఖ మంత్రికి తెలియజేయాలని నిర్ణయించినట్లు బీసీఐ పత్రికా ప్రకటన పేర్కొంది. అనుభవజ్ఞులైన న్యాయవాదులను వివిధ కమిషన్లు, ఇతర ఫోరమ్‌లకు ఛైర్మన్‌లుగా నియమించేలా వివిధ చట్టాలను సవరించాలని కూడా బార్ కౌన్సిల్ తీర్మానం చేసింది. వివిధ చట్టాలను సవరించాలని పార్లమెంట్‌కు ప్రతిపాదించాలని కూడా ఉమ్మడి సమావేశం తీర్మానించింది.గత వారం జరిగిన అన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్‌లు, హైకోర్టు బార్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్త సమావేశంలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు పెంపునకు సంబంధించి చర్చ జరిగింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?