CUET UG-2022 Results: సీయూఈటీ-యూజీ ఫలితాలు వచ్చేశాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CUET UG-2022 Results: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 259 నగరాలు/పట్టణాల్లో 489 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని ఆరు నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తంగా ఆరు దశలుగా జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 14.9లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు. తొలుత గురువారం రాత్రి 10 గంటలకు పరీక్ష ఫలితాలు వెలువడతాయని ప్రకటించారు. అయితే కొన్ని కారణాలతో ఆలస్యం అవుతోందని సమయం పడుతుందని ఎన్‌టీఏ ట్వీట్ చేసింది.
44 సెంట్రల్ యూనివర్సిటీలు, 12 స్టేట్ యూనివర్సిటీలు, 11డీమ్డ్ యూనివర్సిటీలు, 19 ప్రైవేట్ వర్సీటీలతో కలిపి దేశవ్యాప్తంగా 99 యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తొలసారి ఈ పరీక్షను నిర్వహించారు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఈ ఫలితాలు విడుదల చేసినట్టు ఎన్‌టీఏ తెలిపింది. ఫలితాలను ఫలితాలను www.nta.ac.in, https://cuet.samarth.ac.in వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు.మరోవైపు, యూనివర్సిటీలు కొత్త విద్యా సంవత్సరాన్ని అక్టోబర్ ఆఖర్లో లేదా నవంబర్ తొలి వారం నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ తెలిపారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
Telangana Liberation Celebrations: నేడు నగరానికి కేంద్ర మంత్రులు.. షెడ్యూల్ ఖరారు
గతంలో సీయూఈటీ యూజీ ఫలితాలను సెప్టెంబర్ 15వ తేదీలోగా లేదా వీలైతే రెండు రోజుల ముందుగా ప్రకటిస్తామని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ గతవారం ప్రకటించారు. అన్నట్లుగానే కొన్ని గంటలు అటు ఇటుగా ఫలితాలను ప్రకటించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?