BJP MP Laxman: ట్విట్టర్ పిట్ట కేటీఆర్ కూతలు కూస్తోందని.. ఆరిపోయేముందు దీపం వెలుగు ఎక్కువైనట్లుగా చిలక పలుకులు పలుకుతున్నాడని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రైతుల గురించి మొసలి కన్నీళ్లు కార్చే మీరా మాట్లాడేది అంటూ మండిపడ్డారు. కొలువుల కోసం రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నామన్నారు. కానీ మీరేం చేశారు.. మీ ఇంట్లో వాళ్లకు మాత్రమే అన్ని పదవులు వచ్చాయంటూ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ కొడుక్కి వయస్సు లేక ఆ బుడ్డోడికి పదవి ఇవ్వలేదు.. రాజ్య సభనో, లేదంటే దొడ్డి దారిలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలన సాగుతోందంటూ మండిపడ్డారు.
Bandi Sanjay: కొత్త సచివాలయంలో శాశ్వతంగా దళితుడిని సీఎంగా కూర్చోబెట్టే దమ్ముందా?
తెలంగాణ ఉద్యమ సమయంలో మీ ఆస్తులెన్ని? ఇప్పుడు మీ ఆస్తులెన్ని? ప్రజలకు సమాధానం చెప్పాలంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.రోడ్లను అద్దంలా మారుస్తా అన్నారని.. బీజేపీని విమర్శించడం కాదు.. కేటీఆర్.. ముఖం ఆ అద్దంలో చూసుకో అంటూ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబానికి.. ఆత్మ గౌరవానికి జరుగుతున్న యుద్ధమన్నారు.