Boat Capsized in River: బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. కరాటోయా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రయాణికులు నదిలో గల్లంతైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం 30 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం మారియా యూనియన్‌లోని అవులియా ఘాట్‌లో ఈ సంఘటన జరిగిందని పంచగఢ్ డిప్యూటీ కమిషనర్ జహీరుల్ ఇస్లాం ధ్రువీకరించారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఓవర్‌లోడింగ్ కారణంగా బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదాలు సర్వసాధారణం. గత ఏడాది డిసెంబరులో ప్రయాణీకుల ఫెర్రీ కార్గో షిప్‌ను ఢీకొని మునిగిపోవడంతో సుమారు 37 మంది మునిగిపోయారు. నవంబర్‌లో దేశంలోని దక్షిణాన ఉన్న భోలా ద్వీపంలో ఓవర్‌లోడ్ ట్రిపుల్ డెక్కర్ ఫెర్రీ బోల్తా పడడంతో కనీసం 85 మంది మునిగిపోయారు. వారం తర్వాత మరో పడవ మునిగి 46 మంది మరణించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు, బంగ్లాదేశ్‌లో అనేక చిన్న పడవ ప్రమాదాలలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు.
SM Krishna: ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ
బంగ్లాదేశ్‌లోని వేల చిన్న, మధ్య తరహా పడవల్లో 95 శాతానికి పైగా కనీస భద్రతా నిబంధనలను పాటించడం లేదని నావికాదళ అధికారులు తెలిపారు. కానీ బంగ్లాదేశ్‌లోని లక్షలాది మంది ప్రజలు రాజధాని లేదా డెల్టా దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లేందుకు పడవలపై ఆధారపడుతున్నారు.