Rajasthan: దళిత మహిళపై రోజుల తరబడి సామూహిక అత్యాచారం, నిందితుల్లో పూజారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో 25ఏళ్ల దళిత మహిళపై పూజారితో సహా కొంతమంది వ్యక్తులు పదేపదే అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది. మహిళ చాలా రోజులు నిర్బంధంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి కుటుంబ పూజారి, ఆమె కుటుంబం కోసం ప్రార్థనలు చేసే పూజారి సంజయ్ శర్మ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు సంజయ్ శర్మ తొలిసారి అత్యాచారం చేసి ఆ మహిళను వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియో ఆధారంగా బాధితురాలి నుంచి డబ్బు వసూలు చేశాడు. డబ్బు వసూలు చేయడమే కాకుండా కొంతమంది వ్యక్తులతో కలిసి ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడని అజ్మీర్ నార్త్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఛవీ శర్మ తెలిపారు. నిందితులు మహిళకు కొన్ని మత్తుమందులు ఇచ్చారని, ఎంత మంది సామూహిక అత్యాచారం చేశారో చెప్పలేమని డీఎస్పీ శర్మ తెలిపారు. బాధితురాలికి ఓ పాప కూడా ఉన్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా నిందితులు తనను బలవంతంగా నిర్బంధించారని, పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Manchu Lakshmi: ఎవడి దూల వాడిది.. మనోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు
భర్తను, బిడ్డను చంపేస్తానని పూజారి మహిళను బెదిరించాడు. వీడియోను వైరల్ చేస్తానని కూడా చెప్పాడు. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె భర్త తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నిందితులు ఆమెను సెప్టెంబర్ 27న పోలీస్ స్టేషన్ బయట పడేశారు. అక్టోబర్ 7న బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..