Womens Asia Cup 2022: మహిళల ఆసియా కప్ టీ-20 క్రికెట్ టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు నేడు థాయ్‌లాండ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. సెమీ ఫైనల్ చేరుకున్న భారత్ నేడు చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. ఈ టోర్నీలో 5 లీగ్ మ్యాచ్‌లు ఆడిన హర్మన్‌ప్రీత్ సేన.. నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. టోర్నీ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న హర్మన్‌ప్రీత్ బృందం.. దాయాది పాకిస్థాన్ చేతిలో ఓడినా.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో ఏడు దేశాల జట్లు తలపడుతున్నాయి. మధ్యాహ్నం 1గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
National Games: నేషనల్ గేమ్స్ లో తెలంగాణకు మరో స్వర్ణం
గాయంతో గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బరిలోకి దిగితే బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది. మరోవైపు గత మూడు మ్యాచ్‌ల్లో విజయాలతో థాయ్‌లాండ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న థాయ్‌లాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసేందుకు శక్తివంచన లేకుండా పోరాడనుంది. మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌లోనూ ప్రయోగాలు చేసేందుకు టీమిండియా సిద్ధమైంది. ఆత్మవిశ్వాసంతో ఉన్న థాయ్‌లాండ్‌ను కూడా తక్కువ అంచనా వేస్తే గెలుపు కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కిరణ్ నవ్‌గిరే, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, రేణుకా సింగ్, రాజేశ్వరి గయక్వాడ్
థాయ్‌లాండ్ జట్టు: నన్నపట్ కొంచరోయెంకై (వికెట్ కీపర్), నత్తకన్ చంతమ్, నరుఎమోల్ చైవై (కెప్టెన్), సోర్నరిన్ టిప్పోచ్, చనిద సుత్తిరువాంగ్, రోసెనన్ కానో, ఫన్నిత మాయ, నట్టయ బూచతం, ఒన్నిచ కమ్‌చోంఫు, బంతిద లీఫత్తానా, తిపట్చా పుట్టావొంగ్