HCU Laptops Theft: చదువుతున్న వర్సిటీకే స్కెచ్.. 60 ల్యాప్‌టాప్‌తో జంప్.. ప్లాన్ మామూలుగా లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Central University Laptop Theft: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దొంగలు పడ్డారు. యస్.. మీరు విన్నది కరెక్టే. క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్థులే ల్యాప్‌టాప్‌లు ఎత్తుకెళ్లారు. ఈ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారీగా ల్యాప్‌టాప్‌ల చోరీ వెలుగులోకి రావడం కలకలం రేపింది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న క్యాంపస్‌లోనే చదువుతున్న విద్యార్థులు ఒక పథకం ప్రకారం కంప్యూటర్ ల్యాబ్‌లోని 60 ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
READ MORE: Hyderabad ATM Theft: నైస్‌గా స్కెచ్చేశాడు.. స్మార్ట్‌గా రూ.60 లక్షలు దోచేశాడు.. కట్‌చేస్తే..
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
యూనివర్సిటీలోని సీఆర్ రావు ఏఐఎంసీఎస్ విభాగంలోని కంప్యూటర్ ల్యాబ్‌ను లక్ష్యంగా చేసుకుని నిందితులు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. చోరీకి ఒక రోజు ముందు ఇద్దరు విద్యార్థులు కారును తీసుకువచ్చి ల్యాబ్ సమీపంలో పార్క్ చేసి పరిస్థితులను గమనించారు. భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కవరేజ్‌పై వారికి ముందస్తుగానే అవగాహన ఉంది. దీంతో కెమెరాలకు చిక్కకుండా అర్ధరాత్రి సమయంలో క్యాంపస్‌లోకి ప్రవేశించారు.. ల్యాబ్ కిటికీ అద్దాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించిన నిందితులు అక్కడ ఉన్న 60 ల్యాప్‌టాప్‌లను రెండు కార్లలో లోడ్ చేశారు. వెంటనే వాటిని అక్కడి నుంచి తరలించి మరుసటి రోజు కార్లతో బయటకు వెళ్లిపోయారు. ఒక్కసారిగా 60 ల్యాప్‌టాప్‌లు మాయం కావడంతో యూనివర్సిటీ యాజమాన్యం ఖంగుతింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించారు. యూనివర్సిటీ సీసీటీవీ ఐపీ అడ్రస్‌ల ద్వారా పోలీసుల కదలికలను గమనించిన విద్యార్థులు కారును గుర్తుపట్టకుండా నెంబర్ ప్లేట్ మార్చినట్లు విచారణలో తేలింది.
READ MORE: Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఊరట.. ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశాలు..
అంతే కాదు.. చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను నిందితులు బెంగళూరుకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 55 ల్యాప్‌టాప్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మిగతా ల్యాప్‌టాప్‌ల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో కూకట్‌పల్లికి చెందిన రేగుల చంద్రశేఖర్ సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు సాయి చరణ్ , అశ్విన్‌రావును అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయంపై కూడా విచారణ కొనసాగుతోంది.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఇలాంటి చోరీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యాసంస్థల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచించారు..
తాజావార్తలు
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!
-
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!