Womens Asia Cup 2022: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. సెమీఫైనల్‌లో థాయ్‌లాండ్ జట్టుపై ఘన విజయాన్ని సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 74 పరుగుల తేడా థాయ్ జట్టును మట్టి కరిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ 28 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 42 పరుగులతో మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. 150 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఓపెనర్ స్మృతి మంధాన 13 పరుగులు చేసి నిరాశపరిచినా.. జెమీమా రోడ్రిగ్స్(27), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (36) రాణించారు.
Taapsi Pannu: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మళ్లీ టాలీవుడ్ లోకి మిస్టర్ పర్‌ఫక్ట్ హీరోయిన్
149 పరుగులతో బరిలోకి థాయ్‌లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 74 పరుగులే చేసింది. స్కోరును కట్టడి చేయడంలో భారత బౌలర్లు రాణించారు. భారత బౌలర్ దీప్తి శర్మ తన అద్భుతమైన బౌలింగ్‌తో థాయ్‌లాండ్ జట్టుకు చెమటలు పట్టించింది. దీప్తి తాను వేసిన నాలుగు ఓవర్లలో 7పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీయడం గమనార్హం. రాజేశ్వరీ గైక్వాడ్ రెండు వికెట్లు తీసింది. రేణుకా సింగ్, స్నేహ్ రానా, షఫాలీ వర్మ తలో వికెట్ తీశారు. దీంతో గెలుపు భారత్ వశమైంది. ఇప్పటికే భారత్ ఆసియా కప్‌లో ఆరు సార్లు టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ సారి గెలిస్తే ఏడోది కానుంది. కాగా, ఈ మధ్యాహ్నం జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడతాయి. ఈ పోటీలో గెలిచిన టీమ్‌తో భారత్ ఫైనల్‌లో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది.