Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో అపశ్రుతి.. జెండాలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో అపశ్రుతి తలెత్తింది. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం కర్ణాటకలోని బళ్లారి జిల్లా న్యూమోకా గ్రామంలో కొనసాగుతుండగా.. ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు స్తంభానికి జెండాలు కడుతుండగా ఐదుగురు కరెంట్ షాక్‌కు గురయ్యారు. ఆ ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆ ఐదుగురిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ రణదీప్ సింగ్ సుర్జేవాలాలు పరామర్శించారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ప్రమాదం గురించి రాహల్ గాంధీ తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఈ ఘటన దురదృష్టకరమని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. వారికి పెద్ద గాయాలు తగిలాయని ఆయన తెలిపారు.
Iran Protests : హిజాబ్‌పై గర్జిస్తున్న ఇరాన్ మహిళలు.. మతపెద్దలు వెళ్లిపోవాలంటూ డిమాండ్
Also Read
యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని రాహుల్‌గాంధీ సూచించారు. వారు వెంటనే కోలుకునేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు. వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర వెంటనే క్షతగాత్రులను మోకా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాహుల్ గాంధీకి సమీపంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రాహుల్ గాంధీ వెంట ఉన్న భద్రతా బృందం ఆయనకు రక్షణ కల్పించింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ యాత్ర 1000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిమీల దూరం లక్ష్యంతో 12 రాష్ట్రాల మీదుగా కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కొనసాగుతున్న యాత్ర.. ఏపీలోకి ప్రవేశించనుంది. ఏపీలో నేతలు ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!