LVM3 Rocket: అత్యంత బరువైన రాకెట్ ఎల్వీఎం3 నింగిలోకి దూసుకెళ్లనుంది. అక్టోబర్ 23న ఇస్రో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించనుంది. బ్రిటీష్ స్టార్టప్ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. లాంచ్ వెహికల్ మార్క్ 3ని(LVM3) గతంలో జీఎస్‌ఎల్వీ మార్క్ 3 అని పిలిచేవారు. అక్టోబర్ 23న ఉదయం 7గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇది ప్రపంచ వాణిజ్య ప్రయోగ సేవా మార్కెట్లోకి లాంచర్ ప్రవేశాన్ని సూచిస్తుంది.
Dudhsagar Falls : దూద్‌సాగర్ జలపాతం వద్ద కూలిన వంతెన.. తప్పిన పెనుప్రమాదం
క్రయో స్టేజ్, ఎక్విప్‌మెంట్ బే అసెంబ్లింగ్ పూర్తయిందని.. ఉపగ్రహాలను వాహనంలో నిక్షిప్తం చేసి అసెంబుల్ చేశారని, తుది వాహన తనిఖీలు కొనసాగుతున్నాయని ఇస్రో వెల్లడించింది. రాకెట్ ఫైనల్ చెకింగ్ నడుస్తున్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. సరికొత్త రాకెట్ నాలుగు-టన్నుల తరగతి ఉపగ్రహాలను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటిఓ)లోకి ప్రవేశపెట్టగలదు. ఎల్వీఎం3 అనేది రెండు సాలిడ్ మోటార్ స్ట్రాప్-ఆన్‌లు, లిక్విడ్ ప్రొపెల్లెంట్ కోర్ స్టేజ్, క్రయోజెనిక్ స్టేజ్‌లతో కూడిన మూడు-దశల వాహనం. భారతదేశానికి చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్ వన్‌వెబ్‌లో ప్రధాన పెట్టుబడిదారు, వాటాదారు.