హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సిమ్లాలోని రాంపూర్‌లో ఓటేసిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ, రాష్ట్ర చీఫ్ ప్రతిభా సింగ్ మాట్లాడారు. తన పార్టీ 40-45 సీట్లు గెలుస్తుందని, ఈ సారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఆరుగురు అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను శనివారం విడుదల చేసింది. ఆరుగురు అభ్యర్థులతో కూడిన రెండో జాబితాలో ఇద్దరు మహిళలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినీ శ్రీహరన్ సహా ఆరుగురు దోషులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం స్వాగతించారు.
ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరం నుంచి రష్యా దళాలు ఉపసంహరించుకున్న తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ' ఖేర్సన్ మాదే' అని ప్రకటించారు. దీనిని అమెరికా అసాధారణ విజయంగా ప్రశంసించింది.
పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత అఖిల్ గిరి శుక్రవారం అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాలకు చెన్నై నగరం నిండుకుండలా మారింది. చెన్నై, కడలూరు, కాంచీపురం, మధురై, కన్యాకుమారి సహా పలు జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి.
కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద బెయిల్‌పై విడుదలైన రెండు రోజుల తర్వాత మాట్లాడుతూ, అటువంటి కేసులన్నింటినీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని కూడా అన్నారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్ సహా మిగిలిన ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.