Transplant Nose: ఫ్రాన్స్‌లోని సర్జన్లు సరికొత్త చికిత్స చేసి చరిత్ర సృష్టించారు. మహిళ చేతిపై ముక్కును పెంచి, దాన్ని ముఖానికి అతికించారు. నాజల్ కావిటీ క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఓ మహిళ ముక్కును కోల్పోగా.. దీంతో టౌలూస్ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యులు 3డీ-ప్రింటెడ్ బయో మెటీరియల్‌తో చేతిపై ముక్కును పెంచారు. రెండు నెలల తర్వాత దాన్ని కట్ చేసి, ముఖానికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. మైక్రో సర్జరీ ద్వారా.. ముఖం వద్ద ఉండే రక్తనాళాలను ఒక్కోదాన్ని 3డీ ముక్కు రక్తనాళాలతో కలుపుతూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
PM Narendra Modi: మోడీ తెలంగాణ పర్యటన.. మూడంచెల భద్రత ఏర్పాటు
ఫేస్‌బుక్‌లో టౌలౌస్ యూనివర్శిటీ హాస్పిటల్ ముంజేయిపై పెరుగుతున్న ముక్కు చిత్రాలను షేర్ చేసింది. మంగళవారం మహిళ ముఖానికి కొత్త ముక్కును విజయవంతంగా అమర్చినట్లు ఆసుపత్రి ప్రకటించింది. ఈవెనింగ్ స్టాండర్డ్ ప్రకారం, వైద్యులు మైక్రోసర్జరీని ఉపయోగించారు. చేతి చర్మంలోని రక్త నాళాలను మహిళ ముఖంలోని రక్తనాళాలకు అనుసంధానించారు. 10 రోజుల ఆసుపత్రిలో ఉన్న ఆ మహిళ.. అనంతరం మూడు వారాల యాంటీబయాటిక్స్ తర్వాత ఆమె ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. రకమైన పునర్నిర్మాణం ఇంతకు ముందెన్నడూ నిర్వహించబడలేదని, తొలిసారి ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఎముక పునర్నిర్మాణంలో ప్రత్యేకత కలిగిన బెల్జియన్ వైద్య పరికరాల తయారీదారు అయిన సెర్హమ్‌తో వైద్య బృందాల సహకారం వల్ల ఇది సాధ్యమైంది.