remarks against President:’మన రాష్ట్రపతి ఎలా కనిపిస్తారు’.. టీఎంసీ మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
remarks against President: పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత అఖిల్ గిరి శుక్రవారం అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నందిగ్రామ్‌లో జరిగిన ఓ బహిరంగ ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. రాజకీయ విమర్శలకు కారణం అయ్యాయి.
‘మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?’.. అంటూ ఆయన చేసిన కామెంట్ల వీడియో ఒకటి వివాదాస్పదంగా మారింది.”అతను (సువేందు అధికారి) నేను అందంగా లేను అని అంటాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు! మేము ఎవరినీ వారి రూపాన్ని బట్టి అంచనా వేయము, మేము రాష్ట్రపతి (భారతదేశం) పదవిని గౌరవిస్తాము. కానీ మన రాష్ట్రపతి ఎలా కనిపిస్తారు?” నందిగ్రామ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో సువేందు అధికారిని ఉద్దేశిస్తూ టీఎంసీ నేత అఖిల్ గిరి ఇలా ఇన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వాళ్లు చప్పట్లతో అఖిల్‌ను మరింత ప్రోత్సహించడం గమనార్హం.
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
తృణమూల్ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం చెలరేగింది. ప్రతిపక్ష బీజేపీ, టీఎంసీ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్రపతి గిరిజన సమాజానికి చెందినవారు. ఆమె భారతదేశపు మొదటి గిరిజన రాష్ట్రపతి మరియు దేశ రెండవ మహిళా రాష్ట్రపతి. బెంగాల్ మంత్రి ప్రకటనను బీజేపీ ఖండించింది. గిరిజనులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీని “ఆదివాసి వ్యతిరేకం” అని పేర్కొంది. బీజేపీ నేత అమిత్ మాలవియా.. టీఎంసీ నేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “మమతా బెనర్జీ కేబినెట్‌లోని అఖిల్ గిరి.. రాష్ట్రపతిని ఘోరంగా అవమానించారు. అప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ముర్ముకు మమతా బెనర్జీ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇలా అవమానించడాన్ని ప్రోత్సహిస్తున్నారు” అంటూ అమిత్ మాలవియా ట్వీట్ చేశారు.
Tamilnadu rains: తమిళనాడును కుదిపేస్తున్న భారీ వర్షాలు.. నిండుకుండలా చెన్నై నగరం
రాష్ట్రపతిపై ప్రతిపక్ష నేత అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. జూలైలో, కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి అధ్యక్షుడు ముర్ముని ‘రాష్ట్రపత్ని’ అని పిలిచారు, ఇది రాజకీయ గందరగోళాన్ని సృష్టించింది. మరో కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ కూడా అక్టోబర్‌లో ఆమె గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అధ్యక్షుడు ముర్ము ‘చంచాగిరి’ చేశారని ఆరోపించి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఉదిత్ రాజ్ కూడా అధ్యక్షుడిని ‘సైకోఫాన్సీ’ అని ఆరోపించినందున ఇబ్బందులను ఆహ్వానించారు. అయితే, తమ వ్యాఖ్యలపై ఇరువురు నేతలు క్షమాపణలు చెప్పారు.
#WATCH | "We don't judge anyone by their appearance, we respect the office of the President (of India). But how does our President look?," says West Bengal Minister and TMC leader Akhil Giri in Nandigram (11.11.2022) pic.twitter.com/UcGKbGqc7p
— ANI (@ANI) November 12, 2022
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!